మోదీ వెన్నంటే పవన్ కల్యాణ్- ఆప్యాయంగా పలకరింపు
న్యూఢిల్లీ: వచ్చే సంవత్సరం సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీఏ- దీని దూకుడును నిలువరించడానికి యూపీఏ సమాయాత్తమౌతోన్నాయి. ఎన్డీఏను ఉమ్మడిగా ఎదుర్కొనడానికి దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమౌతోన్నాయి.
#WATCH | PM Modi being garlanded by National Democratic Alliance (NDA) leaders as their meeting to chalk out a joint strategy to take on opposition alliance 'INDIA' in the 2024 Lok Sabha polls, begins in Delhi pic.twitter.com/Fj14GtPBam
— ANI (@ANI) July 18, 2023
బీజేపీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమి కూడా ఇవ్వాళ దేశ రాజధానిలో భేటీ ఏర్పాటు చేసింది. ఢిల్లీలోని హోటల్ అశోకలో ఈ భేటీ ఏర్పాటైంది. ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పార్టీలు, మిత్రపక్షాలు ఈ సమావేశానికి హాజరయ్యారు. మొత్తంగా 38 పార్టీల నాయకులు ఇందులో పాల్గొన్నారు.

దీనికి సంబంధించిన జాబితాను బీజేపీ అధికారికంగా విడుదల చేసింది. బీజేపీ, శివసేన (ఏక్‌నాథ్ షిండే వర్గం), నేషనల్ పీపుల్స్ పార్టీ (అజిత్ పవార్ వర్గం), రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ (పశుపతి కుమార్ పరాస్ వర్గం), ఏఐఏడీఎంకే, అప్నాదళ్ (సోనేలాల్), నేషనల్ పీపుల్స్ పార్టీ, నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ.. ఈ జాబితాలో ఉన్నాయి.
వీటితో పాటు ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్, సిక్కిం క్రాంతికారి మోర్చా, మిజో నేషనల్ ఫ్రంట్, ఇండిజీనియస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర, నాగా పీపుల్స్ ఫ్రంట్, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అధవాలే), అసోం గణ పరిషత్, పట్టాళి మక్కల్ కచ్చి, తమిళ మానిళ కాంగ్రెస్, యునైటెడ్ పీపుల్స్ ఫ్రంట్ లిబరల్, సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ నాయకులు ఇందులో పాల్గొన్నానున్నారు.
శిరోమణి అకాలీదళ్ (సంయుక్త్), మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ, జన్‌నాయక్ పార్టీ, ప్రహార్ జన్‌శక్తి పార్టీ, రాష్ట్రీయ సమాజ్ పక్ష, జన్ సురాజ్య శక్తి పార్టీ, కురీ పీపుల్స్ అలయెన్స్, యునైటెడ్ డెమొక్రటిక్ పార్టీ (మేఘాలయా), హిల్ స్టేట్ పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ, నిషాద్ పార్టీ, ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్, హెచ్ఏఎం, జనసేన పార్టీ..కి ఆహ్వానం అందింది.
హర్యానా లోక్‌హిత్ పార్టీ, భారత్ ధర్మ జనసేన, కేరళ కామరాజ్ కాంగ్రెస్, పుథియ తమిళగం, లోక్ జన్‌శక్తి పార్టీ (రామ్ విలాస్ పాశ్వాన్), గోర్ఖా నేషనల్ లిబరేషన్ ఫ్రంట్.. నాయకులు ఇందులో పాల్గొననున్నారు. నిజానికి- ఎన్డీఏ బలం 30 పార్టీలే అయినప్పటికీ.. రాత్రికి రాత్రి మరో ఎనిమిది పార్టీలు.. ఎన్డీఏకు మద్దతు ప్రకటించాయి. దీనితో సంఖ్య 38కి పెరిగింది.

సమావేశం ప్రారంభం సందర్భంగా ప్రధాని మోదీ- ఆయా పార్టీల నేతలతో గ్రూప్ ఫొటో దిగారు. ఆ సమయంలో పవన్ కల్యాణ్.. మోదీ వెనుకే నిల్చుని కనిపించారు. వేదిక మీద మోదీకి కుడివైపున లోక్ జన్‌శక్తి పార్టీ (రామ్ విలాస్ పాశ్వాన్) అధినేత చిరాగ్ పాశ్వాన్, ఎడమ వైపున జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ నిల్చున్నారు.
ఫొటో తీసుకున్న అనంతరం మోదీ.. ఆప్యాయంగా పవన్ కల్యాణ్‌ను పలకరించారు. చిరునవ్వుతో పవన్ ఆయనకు నమస్కరించారు. షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆ వెంటనే ఆయా పార్టీల నాయకులందరూ గజమాలతో మోదీని సన్మానించారు. అక్కడి నుంచి నేరుగా సమావేశ మందిరానికి బయలుదేరి వెళ్లారు.












Click it and Unblock the Notifications