గో సంరక్షణ కోసం చర్యలు తీసుకుంటే.. తిరోగమనం అంటారా... విపక్షాలపై నమో ఫైర్
న్యూఢిల్లీ : గో సంరక్షణ కోసం చర్యలు తీసుకుంటుంటే విపక్షాలు విమర్శించడాన్ని ప్రధాని నరేంద్ర మోడీ తప్పుపట్టారు. విపక్షాల ఆరోపణల్లో పసలేదని విమర్శించారు. గో సంరక్షణ కోసం పాటుపడుతుంటే దేశాన్ని వెనక్కి తీసుకెళ్తున్నారని కొందరు చేస్తున్న విమర్శలను తప్పుపట్టారు. ఇది సరికాదని వారికి హితవు పలికారు. బుధవారం ప్రధాని మోడీ మధురలో జాతీయ జంతు వ్యాధి నివారణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విపక్షాల ఆరోపణలకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.
గో సంరక్షణ పేరుతో దేశం తిరోగమిస్తోందని విపక్షాలు పదే పదే ఆరోపణలు గుప్పిస్తున్నాయి. గో సంరక్షణ అని చెప్తూ దేశాన్ని 16వ శతాబ్దంలోకి తీసుకెళ్తున్నారని విమర్శిస్తున్నారు. దీనిపై ప్రధాని మోడీ స్పందిస్తూ .. అలాంటి వారి వల్లే దేశం వెనక్కి నెట్టవేయబడుతుందని పేర్కొన్నారు. తమ స్వార్థ సంకుచిత రాజకీయాల కోసం విమర్శలు చేయడం సరికాదని మండిపడ్డారు.

పశు సంరక్షణ కోసం జాతీయ జంతు వ్యాధి నివారణ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. ముఖ్యంగా జంతువుల్లో కాలు, నోటిలో బ్యాక్టీరియాతో రోగాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా బ్రూసెల్లొసిస్ బ్యాక్టీరియా బారిన పడుతున్నారు. దీంతో గేదెలు, గొర్రె, మేక, పందులపై ఎక్కువ ప్రభావం చూపుతుంది.
ఈ రోగాల బారి నుంచి విముక్తి చేసేందుకు 500 మిలియన్ల వ్యాక్సిన్లు పంపించినట్టు గుర్తుచేశారు. అయితే దూడల్లో రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నందున బ్యాక్టిరీయా సోకి చనిపోతున్నాయని తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. ఈ క్రమంలో బ్యాక్టీరియాను 2025 నాటికి నియంత్రణలోకి తీసుకొస్తామని .. అదీ 2030 నాటికి పూర్తిగా నిర్మూలిస్తామని ప్రధాని మోడీ స్పష్టంచేశారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications