రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోదీ కీలక భేటీ..
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. ఇవాళ సాయంత్రం దిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ద్రౌపది ముర్ముతో ప్రధాని మోదీ సమావేశం అయ్యారు. పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ జపాన్, చైనా పర్యటనల అనంతరం జరుగుతున్న భేటీ కావడంతో విదేశీ పర్యటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధాని మోదీ చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే భారత్- అమెరికా వాణిజ్య సంబంధాలు, భారత్ పై సుంకాలు విధింపు.. తదితర అంశాలనూ ప్రస్తావించినట్లు సమాచారం. అలాగే దేశవ్యాప్తంగా వరదలు.. ముఖ్యంగా పంజాబ్ లో ఆకస్మిక వరదలపైనా ద్రౌపది ముర్ముతో ప్రధాని మోదీ చర్చించినట్లు సమాచారం.
Prime Minister Shri @narendramodi called on President Droupadi Murmu at Rashtrapati Bhavan. pic.twitter.com/dzTcOjpBp5
— President of India (@rashtrapatibhvn) September 6, 2025
ప్రధాని నరేంద్ర మోదీ.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశం అయ్యారు. సెప్టెంబర్ 6 సాయంత్రం దిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ద్రౌపది ముర్ముతో ప్రధాని మోదీ సమావేశం అయ్యారు. ఈ భేటీలో జపాన్, చైనా పర్యటన తర్వాత రాష్ట్రపతి, ప్రధాని మోదీ మధ్య జరుగుతున్న సమావేశం కావడంతో ఈ భేటీ ప్రత్యేకతను సంతరించుకుంది. చైనాలోని తియాంజిన్ వేదికగా జరిగిన SCO సమావేశంలో ప్రధాని మోదీ.. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ లతో చర్చలు జరిపిన విషయం తెలిసిందే. ఇరు దేశాలతో పలు కీలక అంశాలపై ప్రధాని మోదీ చర్చించారు.

అంతకుముందు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ తో ప్రధాని మోదీ సమావేశం అయ్యారు. అనంతరం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. అధ్యక్షుడు మాక్రాన్ తో వివిధ రంగాలలో ద్వైపాక్షిక సహకారంలో పురోగతిపై సమీక్ష జరిపామని తెలిపారు. ఉక్రెయిన్ లో వివాదాన్ని త్వరగా ముగించే ప్రయత్నాలు సహా అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలపై అభిప్రాయాలను మార్పిడి చేసుకున్నామని వివరించారు. ప్రపంచ శాంతి, స్థిరత్వాన్ని పెంపొందించడంలో భారత్- ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యం కీలక పాత్ర పోషిస్తూ ఉంటుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications