వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కురేభర్ ఎయిర్ స్ట్రిప్ ప్రారంభించిన మోడీ-ఫైటర్ జెట్ లో ల్యాండ్ అయి-టార్గెట్ చైనా

|
Google Oneindia TeluguNews

భారత్, చైనా మధ్య ఘర్షణలు పెరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్ అవసరాల్ని దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఉత్తర్ ప్రదేశ్ లో పూర్వాంచల్ ఎక్స్ ప్రెస్ వేను నిర్మించింది. దీనిపైనే సుల్తాన్ పూర్ జిల్లాల్లో కురేభర్ ఎయిర్ స్ట్రిప్ ను కూడా నిర్మించింది. ఈ రెండింటిని ప్రధాని మోడీ ఇవాళ ప్రారంభిచారు.

Recommended Video

Kurebhar Airstrip : హైవేలపై ఎయిర్‌స్ట్రిప్‌లు.. టార్గెట్ China | Pakistan పాఠాలతో || Oneindia Telugu

పూర్వాంచల్ ఎక్స్ ప్రెస్ వేను ప్రారంభించిన ప్రధాని మోడీ ఆ తర్వాత స్వయంగా వాయుసేన విమానంలో వెళ్లి కురేభర్ ఎయిర్ స్ట్రిప్ పై దిగారు. అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎయిర్ ఫోర్స్ అధికారులతో కలిసి ఎయిర్ స్ట్రిప్ ను ప్రారంభించారు. వాయుసేన భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నిర్మించిన ఈ ఎయిర్ స్ట్రిప్ పై అత్యవసర పరిస్ధితుల్లో యుద్ధ విమానాలతో పాటు సాధారణ విమానాలు కూడా దిగేందుకు అవకాశం ఉంది.

pm modi inaugurate kurebhar airstrip today as part of iafs plan to counter china

వాస్తవానికి కురేభర్ ఎయిర్ స్ట్రిప్ పై కేంద్రం ఎక్కువగా ప్రచారం కల్పించడం లేదు. అలాగే ఎయిర్ ఫోర్స్ కూడా గోప్యంగా ఉంచుతోంది. ఇవాళ పూర్వాంచల్ ఎక్స్ ప్రెస్ వే ప్రారంభ కార్యక్రమం సందర్భంగా ఇక్కడ ఎయిర్ షో నిర్వహణ కోసమే ఎయిర్ స్ట్రిప్ నిర్వహించినట్లు మాత్రమే ప్రకటించారు. యూపీలో కేంద్రం కేటాయించిన రెండు ఎయిర్‌స్ట్రిప్‌లు భారత ఎయిర్‌బేస్‌లకు దగ్గరగా ఉన్నాయి, తద్వారా ఇంధనం, ఆయుధాలను ల్యాండింగ్ ఫైటర్‌ జెట్ లకు లేదా రవాణా విమానాలకు ఎలాంటి పరిస్ధితుల్లో అయినా సరఫరా చేయవచ్చు.

చైనా కొత్త విమానాశ్రయాలను నిర్మించడం, 3488 కి.మీ వాస్తవాధీన రేఖ వెంట ఉన్న వాటిని అప్‌గ్రేడ్ చేయడంతో, కొత్తగా ప్రారంభించిన పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేలో కురేభార్ వద్ద 3.3 కిలోమీటర్ల పొడవైన ఈ రన్‌వే యుద్ధ సమయాల్లో ప్రధాన పాత్ర పోషించేలా రూపొందించారు. ఎలాంటి క్లిష్ట సమయాల్లో అయినా రవాణా కార్యకలాపాలు చేపట్టే అవకాశం ఉంది. లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై ఇలాంటిదే మరో ఎయిర్‌స్ట్రిప్ కూడా నిర్మించారు.

యూపీ రహదారులపై కొత్తగా నిర్మించిన ఎయిర్‌స్ట్రిప్‌లు మిరాజ్-2000 H వంటి ఫైటర్‌ల బరువు తట్టుకోవడానికి, C వంటి రవాణా విమానాలను నిర్వహించడానికి పనికొస్తాయని అధికారులు చెప్తున్నారుూ. ప్రత్యేకంగా రూపొందించిన రహదారులతో భారత వైమానిక దళం భవిష్యత్ అవసరాలు తీరనున్నాయి. గతంలో 1965, 1971 యుద్ధాల సమయంలో, పాకిస్తాన్ వైమానిక దళం వేసిన బాంబులతో మన ఎయిర్ ఫోర్స్ చాలా విమానాలు కోల్పోయింది. ఆ అనుభవం నుండి నేర్చుకున్న పాఠాలతోనే వైమానిక దళం, తాత్కాలిక లైట్లు, మొబైల్ ఎయిర్ ట్రాఫిక్ కమ్యూనికేషన్లు, ఇంధనం నింపడం, ఆయుధాలతో లోడ్ చేసిన తర్వాత టేకాఫ్ చేయడం కోసం హైవేలపై ఈ కేటాయించిన ఎయిర్‌స్ట్రిప్‌లను ఉపయోగించాలని నిర్ణయించింది,

English summary
pm modi on today inagurated kurebhar air strip on purvanchal express way as a part of iaf's counter plan against china.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X