వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అరుణాచల్‌ప్రదేశ్‌లో తొలి ఎయిర్‌పోర్టు ప్రారంభించిన మోడీ: ప్రత్యేకతలు

|
Google Oneindia TeluguNews

ఈటానగర్: ఈశాన్య రాష్ట్రాలకు కనెక్టివిటీ మెరుగుపర్చేందుకు కీలక అడుగుపడింది. అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలో తొలి 'గ్రీన్ ఫీల్డ్' విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం ప్రారంభించారు. రాజధాని ఈటానగర్‌లోని హెల్లంగి ప్రాంతంలో నిర్మించిన డోనీ-పోలో విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేశారు. దీంతో అరుణాచల్‌ప్రదేశ్‌లో తొలి ఎయిర్‌పోర్టు అందుబాటులోకి వచ్చింది.

అరుణాచల్‌ప్రదేశ్‌లో తొలి గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం


2019 నవంబర్‌లో ప్రధాని మోడీ ఈ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయానికి శంకుస్థాపన చేశారు. సుమారు రూ. 645 కోట్లతో ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ విమానాశ్రయాన్ని నిర్మించింది. నూతన విమానాశ్రయం ప్రారంభించిన అనంతరం ప్రధాని మోడీ ప్రసంగించారు. గత ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు.

అప్పుడు ఎన్నికల కోసమన్నవాళ్లకు గట్టి దెబ్బంటూ మోడీ


తాను 2019లో శంకుస్థాపన చేసినప్పుడు కొంతమంది రాజకీయ నేతలు విమర్శలు చేశారని గుర్తు చేశారు. అసలు ఎయిర్ పోర్ట్‌ను నిర్మించరని, ఎన్నికల కోసమే మోడీ శంకుస్థాపన చేస్తున్నారని ఆరోపించారని మండిపడ్డారు. తాజాగా, విమానాశ్రయం ప్రారంభోత్సవంతో విమర్శలు చేసిన వారికి గట్టి దెబ్బ తగిలినట్లయిందన్నారు. దశాబ్దాలుగా ఈశాన్య ప్రాంతం నిర్లక్ష్యానికి బలైపోయిందని ప్రధాని మోడీ అన్నారు.

ఈశాన్య రాష్ట్రాలకు ప్రాధాన్యత అంటూ మోడీ

వాజపేయి ప్రభుత్వం వచ్చాక ఈ పరిస్థితిని మార్చేందుకు కృషి చేశారని మోడీ అన్నారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిన మొదటి ప్రభుత్వం వాజపేయిదేనని చెప్పారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దాన్ని ముందుకు తీసుకెళ్లలేదని కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వాలు ఈశాన్య రాష్ట్రాలను సుదూర ప్రాంతాలని అనుకునేవని.. కానీ తమ ప్రభుత్వం వాటికి ప్రాధాన్యం ఇచ్చిందన్నారు.

అరుణాచల్‌ప్రదేశ్ విమానాశ్రయం ప్రత్యేకతలివే

సేవ చేసేందుకు తనకు అవకాశం కల్పించారని.. దీంతో ఈశాన్యంలో మార్పు తెచ్చేందుకు మరో శకం ప్రారంభమైందని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. నూతన విమానాశ్రయంలో 8 చెక్ఇన్ కౌంటర్లతోపాటు వెయిటింగ్ హాల్‌లను ఏర్పాటు చేశారు. మొత్తం 4100 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన డోనీ-పోలో విమానాశ్రయంలో 2300 మీటర్ల పొడవైన రన్ వేను నిర్మించారు. దీనిపై బోయింగ్-747 లాంటి భారీ విమానాలను కూడా ల్యాండింగ్, టేకాఫ్ చేయవచ్చని అధికారులు వెల్లడించారు.

600 మెగావాట్ల హైడ్రో పవర్ ప్రాజెక్టు జాతికి అంకితం చేసిన మోడీ

డోనీ-పోలో విమానాశ్రయంతోపాటు పశ్చిమ కమెంగ్ జిల్లాలో నిర్మించిన 600 మెగావాట్ల హైడ్రో పవర్ ప్రాజెక్టును ప్రధాని జాతికి అంకితం చేశారు. రూ. 8,450 కోట్లతో నిర్మించిన ఈ ప్రాజెక్టుకు పశ్చిమ కమెంగ్ జిల్లాలో 80 కిలోమీటర్ల విస్తరించి ఉంది. ఈ ప్రాజెక్టు ద్వారా అరుణాచల్ ప్రదేశ్ ను విద్యుత్ మిగులు రాష్ట్రంగా మారడంతోపాటు జాతీయ గ్రిడ్‌కు ప్రయోజనం కలుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, తాజా చైనాకు సరిహద్దుగా ఉన్న అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలో విమానాశ్రయం అందుబాటులోకి రావడం మనదేశ భద్రతా దళాలకు కూడా కలిసివచ్చే అవకాశం ఉంది.

English summary
PM Modi inaugurates first greenfield airport in Arunachal Pradesh, 600-MW Kameng hydro project.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X