లంచం కేసులో సీబీఐ అధికారుల వార్: రంగంలోకి ప్రధాని నరేంద్ర మోడీ
న్యూఢిల్లీ: సీబీఐ ఇష్యూ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ జోక్యం చేసుకున్నారు. రూ.కోట్ల లంచానికి సంబంధించి సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ, స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానాల మధ్య వివాదం ప్రకంపనలు సృష్టిస్తోంది. రాకేష్ ఆస్థానా ప్రధాని మోడీకి సన్నిహితుడిగా భావిస్తారు.
దీంతో రాజకీయ రంగు పులుముకుంది. దీంతో స్వయంగా ప్రధాని మోడీ రంగంలోకి దిగారు. నష్ట నివారణ చర్యలు చేపట్టారు. ఇద్దరు కలిసి తన వద్దకు రావాలని ఆయన సమన్లు జారీ చేశారు. తనను కలిసి వివరణ ఇవ్వాలని చెప్పారు.

కాగా, మాంసం ఎగుమతి వ్యాపారం చేసే మొయిన్ ఖురేషీపై మనీలాండరింగ్ కేసు మాఫీ కోసం రాకేష్ ఆస్థానా రూ.కోట్ల లంచం తీసుకున్నారంటూ సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇదే కేసు విషయంలో అలోక్ వర్మ లంచం తీసుకున్నారంటూ కేంద్ర కేబినెట్ కార్యదర్శికి ఆస్థానా రెండు నెలల క్రితం లేఖ రాశారు. ఇప్పుడు ఎదురు తిరిగి ఆస్థానా పైనే సీబీఐ కేసు నమోదయింది.
మరోవైపు, రాకేష్ ఆస్థానాతో కలిసి పని చేసిన అధికారి దేవేంద్ర కుమార్‌ను కూడా సీబీఐ సోమవారం అరెస్టు చేసింది. చీఫ్ పైన అవాస్తవ ఆరోపణలు చేసినందుకు అదుపులోకి తీసుకున్నారు.
-
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..!












Click it and Unblock the Notifications