మోదీ ఎన్నికల జిమ్మిక్కులు, ప్రజలు గమనిస్తున్నారు, మాజీ సీఎం సెటైర్లతో షాక్ !
బెంగళూరు/హుబ్బళి: కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ వంట గ్యాస్ సిలిండర్ల ధర తగ్గించడం ఎన్నికల జిమ్మిక్కేనా? కేంద్ర ప్రభుత్వం జిమ్మిక్కులు భలే ఉన్నాయని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి జగదీష్ శెట్టర్ కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ మాయలు ప్రజలు గమనిప్తున్నారని జగదీష్ శెట్టర్ అన్నారు.
బుధవారం హుబ్బళిలో మాజీ సీఎం జగదీష్ శెట్టర్ విలేకరులతో మాట్లాడుతూ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ముందే ఉచిత హామీలను కాంగ్రెస్ ప్రకటించిందన్నారు. బడ్జెట్‌లో నిధులు కూడా కేటాయించారని, ఈ రోజు 1.20 కోట్ల మంది మహిళలు లబ్దిపొందడానికి వారి పేర్లు నమోదు చేసుకుక్నారని మాజీ సీఎం జగదీష్ శెట్టర్ చెప్పారు.

బీజేపీలో వర్గ పోరు మొదలైంది. చేయాల్సిన పని గురించి మాట్లాడటం మొదలుపెట్టాడు. మా పార్టీ మీద మీరు చేస్తున్న ఆరోపణలు మంచి పరిణామం కాదని మాజీ సీఎం జగదీష్ శెట్టర్ అన్నారు. క్లబ్‌లు, బార్‌లకు ఆల్ నైట్ లైసెన్స్‌లు ఇచ్చారని, అర్దరాత్రి దాటే వరకు బార్లు తియ్యడానికి అనుమతి ఇచ్చారనే విమర్శల గురించి మాజీ సీఎం జగదీష్ శెట్టర్ మాట్లాడారు.

ఇప్పటికీ సాధారణ పనివేళలు కొనసాగుతున్నాయని, ఇప్పుడు ఇంకా కొంచెం సమయం పెంచారని, ఇది గత మీ ప్రభుత్వంలో లేదా అని చెప్పాలని మాజీ సీఎం జగదీష్ శెట్టర్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు మూడు నెలల క్రితం పెద్ద పెద్ద ప్రాజెక్టులు మంజూరు చేశారని, టెండర్లు పిలిచారని, ఆర్థిక శాఖ నుంచి అనుమతి లేకపోయినా బీజేపీ నాయకులు నానా హంగామా చేశారని మాజీ సీఎం జగదీష్ శెట్టర్ ఆరోపించారు.
సిద్ధరామయ్య అన్నీ లెక్కించి 14వ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ధారవాడ జిల్లాలో నేను ఎక్కడికి వెళ్లినా బీజేపీ నాయకులు, కార్యకర్తలు తనను వ్యక్తిగతంగా కలిశారని, ఏం చేయాలో తెలీక దిక్కుతోచని స్థితిలో ఉన్నామని వారు చెప్పారని జగదీష్ శెట్టర్ తెలిపారు. మొత్తం మీద బీజేపీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ లో చేరిన మాజీ సీఎం జగదీష్ శెట్టర్ వేసిన ప్రశ్నలకు బీజేపీ నాయకులు ఎలాంటి సమాధానం చెబుతారో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications