వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జనాదరణలో మళ్లీ మోడీ టాప్ ! తాజా సర్వేలో 75 శాతం ఆమోదం-బైడెన్, రిషీ దిగదుడుపే..

ప్రపంచ జనాకర్షక నేతల జాబితాలో ప్రధాని మోడీ మరోసారి అగ్రస్ధానంలో నిలిచారు. అంతర్జాతీయంగా టాప్ 22 దేశాల జాబితా ప్రకారం నిర్వహించిన సర్వేలో మోడీ ఏకంగా 75 శాతం జనామోదంతో టాప్ లో నిలిచారు.

|
Google Oneindia TeluguNews

ప్రపంచవ్యాప్తంగా అగ్రదేశాల్లో అత్యంత జనాకర్షక నేతలపై నిర్వహించిన తాజా సర్వేలోనూ ప్రధాని మోడీ టాప్ లో నిలిచారు. గతంలో భారత్ తో పాటు అంతర్జాతీయంగా నిర్వహించిన పలు సర్వేల్లో అగ్రస్దానం సంపాదించిన మోడీ మరోసారి దాన్ని నిలబెట్టుకున్నారు. అంతర్జాతీయ సంస్ధ మార్నింగ్ కన్సల్ట్ నిర్వహించిన తాజా సర్వేలో మోడీ ఏకంగా 75 శాతం మంది జనామోదంతో అగ్రస్దానంలో నిలిచారు.

జనామోదంలో మోడీ టాప్

జనామోదంలో మోడీ టాప్

ప్రపంచవ్యాప్తంగా అగ్రదేశాలకు చెందిన నేతల్లో అత్యంత ప్రజాదరణ ఉన్న నేతలపై పొలిటికల్ ఇంటెలిజెన్స్ కంపెనీ మార్నింగ్ కన్సల్ట్ తాజాగా నిర్వహించిన సర్వేలో భారత ప్రధాని నరేంద్రమోడీ మరోసారి అగ్రస్ధానంలో నిలిచారు. 75% కంటే ఎక్కువ ఆమోదం రేటింగ్‌తో ప్రపంచంలోనే అత్యధికంగా ఇష్టపడే నాయకుడిగా ప్రధాని నరేంద్ర మోదీ నిలిచారు. మార్నింగ్ కన్సల్ట్ సర్వే చేసిన 22 దేశాలలో జనామోదం రేటింగ్‌ల ఆధారంగా ట్రెండింగ్‌లో ఉన్న ప్రపంచ నాయకుల జాబితాను విడుదల చేసింది. ఇందులో మోడీ తర్వాత స్ధానాల్లో మెక్కో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రాడోర్, స్విట్లర్లాండ్ అధినేత అలైన్ బెర్సెట్ ఉన్నారు.

మార్నింగ్ కన్సల్ట్ సర్వే ఇలా

మార్నింగ్ కన్సల్ట్ తాజాగా 22 దేశాల అధినేతలపై ఈ సర్వే నిర్వహించింది. ఈ ఏడాది జనవరి 26 నుంచి 31 మధ్య ఈ సర్వేను నిర్వహించింది. ఇందులో ఆయా నేతలు తమ దేశాల్లో పొందుతున్న ప్రజాదరణ ఆధారంగా ఈ గణాంకాల్ని లెక్కించారు. ఇందులో భారత ప్రధాని మోడీ 75 శాతం జనామోదం పొందుతున్నట్లు నిర్దారించారు. ఆ తర్వాత స్ధానాల్లో ఉన్న నేతల్ని వారి దేశాల్లో ప్రజలు ఏ మేరకు ఇష్టపడుతున్నారన్న దానిపై ఈ సర్వే ఫలితాల్ని ప్రకటించారు.

బైడెన్, రిషీల్ని వెనక్కి నెట్టిన మోడీ ?

బైడెన్, రిషీల్ని వెనక్కి నెట్టిన మోడీ ?

22 దేశాల అధినేతలపై మార్నింగ్ కన్సల్ట్ నిర్వహించిన సర్వేలో భారత ప్రధాని తొలిస్ధానం సాధించారు. అయితే ఈ జాబితాలో అనూహ్యంగా అగ్రదేశాలుగా చెప్పుకుంటున్న అమెరికా అధ్యక్షుడు జో బైడన్, బ్రిటన్ ప్రధాని రిషీ సునాక్ చాలా వెనుక బడ్డారు. జో బిడెన్ ఈ జాబితాలో ఏడవ స్థానంలో నిలిచారు. నార్వే ప్రధాన మంత్రి జోనాస్ గహర్ స్టోర్, దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సియోక్-యుల్, జపాన్ ప్రధాన మంత్రి ఫుమియో కిషిడా చివరి మూడు స్థానాల్లో ఉన్నారు. తాజా సర్వేలో 78% మంది ప్రజలు ప్రధాని మోదీని ఆమోదించగా, 18% మంది ఆయనను తిరస్కరించారు. మోడీ ఆమోదం రేటింగ్ తాజాగా బాగా పెరిగి జనవరి మూడవ వారంలో 79%కి చేరుకుందని తెలిపారు.

English summary
pm modi once again stands top in world most liked leaders list, according to morning consult's latest survey.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X