ప్రధాని మోడీ మాతో ఉన్నారు: ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. తమిళనాడు మంత్రి ధీమా, పార్టీ మాదే !

ప్రధాని నరేంద్ర మోడీ మా వెంట ఉన్నారు. ఎవ్వరూ ఏమీ చెయ్యలేరుఅన్నాడీఎంకే ప్రభుత్వం అధికారంలో ఉంటుంది, రెండాకుల గుర్తు మాదేబహిరంగ సభలో సంచలన వ్యాఖ్యలు చేసిన తమిళనాడు మంత్రి రాజేంద్ర బాలాజీ

బెంగళూరు: ప్రధాని నరేంద్ర మోడీ మా వెంట ఉన్నంత వరకూ అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరని తమిళనాడు మంత్రి రాజేంద్ర బాలాజీ అన్నారు. తమిళనాడులోని అందిపట్టి ప్రాంతంలో అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తల సమవేశంలో మంత్రి రాజేంద్ర బాలాజీ మాట్లాడారు.

తమిళనాడులో ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వానికి ప్రధాని నరేంద్ర మోడీ అండ ఉందని మంత్రి రాజేంద్ర బాలాజీ బహిరంగంగా చెప్పారు. అన్నాడీఎంకే పార్టీ, రెండాకుల చిహ్నం ఎడప్పాడి పళనిసామి, పన్నీర్ సెల్వం వర్గంకే వస్తుందని, అందులో ఎలాంటి సందేహం లేదని మంత్రి రాజేంద్ర బాలాజీ ధీమా వ్యక్తం చేశారు.

PM Modi is with us, nobady can shake AIADMK: Tamil Nadu Minister

అన్నాడీఎంకే పార్టీలోని 92 శాతం మంది జిల్లా నాయకులు ఎడప్పాడి పళనిసామి వర్గానికి మద్దతు ఇస్తున్నారని మంత్రి రాజేంద్ర బాలాజీ గుర్తు చేశారు. తమిళనాడులోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ డీఎంకే ఎన్ని కుట్రలు చేసినా అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని కదిలించలేదని, అలాంటి ప్రయత్నాలు మానుకుంటే మంచిదని మంత్రి రాజేంద్ర బాలాజీ ఆ పార్టీ నాయకులను హెచ్చరించారు. తమిళనాడులో అన్నాడీఎంకే ప్రభుత్వం అధికారం పూర్తి చేసుకుంటుందని మంత్రి రాజేంద్ర బాలాజీ ధీమా వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+