వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రొఫైల్​ పిక్చర్​గా జాతీయ జెండా - ఆ మూడు రోజులు ఇలా : ప్రధాని మోదీ..!!

|
Google Oneindia TeluguNews

ఆజాదీ కా అమృత్​ మహోత్సవ్​ కార్యక్రమం ఓ సామూహిక ఉద్యమంగా మారడం సంతోషంగా ఉందని ప్రధాని మోదీ చెప్పారు. మన్​కీ బాత్​ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన షహీద్ ఉధమ్ సింగ్​కు ఆయన నివాళులర్పించారు. ఇదే సమయంలో ఆయన దేశ ప్రజలకు కీలక పిలుపు ఇచ్చారు. ఆగస్టు 2 నుంచి 15 తేదీ వరకు దేశ ప్రజలందరూ తమ సోషల్​ మీడియా ఖాతాల ప్రొఫైల్​ పిక్చర్​గా జాతీయ జెండా ఫొటో పెట్టుకోవాలని ప్రధాని కోరారు.

13 నుంచి 15 వరకు హర్​ ఘర్​ తిరంగా


ఆజాదీ కా అమృత్​ మహోత్సవ్​ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 13 నుంచి 15 వరకు 'హర్​ ఘర్​ తిరంగా' పేరుతో ప్రత్యేక ఉద్యమం నిర్వహిస్తున్నామని ప్రధాని వివరించారు. ఆ మూడు రోజులు.. ప్రతి ఇంటి వద్ద జాతీయ జెండా ఎగురవేసి దేశభక్తిని చాటుకోవాలని సూచించారు. దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు ఈ ఉత్సవాల్లో ఏదో రూపంలో 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' భాగస్వాములవుతున్నారని చెప్పుకొచ్చారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న తరుణంలో మనమందరం ఒక అద్భుతమైన, చరిత్రాత్మక ఘట్టాన్ని చూడబోతున్నామని ప్రధాని మోదీ వెల్లడించారు. ప్రస్తుతం జరగుతున్న కామన్ వెల్త్ గేమ్స్ లో దేశానికి పతకాలు తెచ్చిన అథ్లెట్లను ప్రధాని మోదీ అభినందించారు.

ప్రొఫైల్ గా జాతీయ జెండా

ప్రొఫైల్ గా జాతీయ జెండా


గతంలో జరిగిన దాని కంటే ఈ సారి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ప్రత్యేకత ఉందని... ప్రతీ ఇల్లు ఈ వేడుకల్లో భాగస్వామ్యం కావాలని ప్రధాని పిలుపునిచ్చారు. మువ్వన్నెల జెండా రూపకర్త పింగళి వెంకయ్య జయంతి ఆగస్టు 2నే అని ప్రధాని గుర్తుచేశారు. త్రివర్ణ పతాక రూపకల్పనలో మేడం కామా కూడా కీలక పాత్ర పోషించినట్లు ఆయన స్మరించుకున్నారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా కర్ణాటకలో అమృత భారతి కన్నడర్తి పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వివరించారు. స్వాతంత్ర్య పోరాటంలో రైల్వేల ప్రాముఖ్యతను వివరిస్తూ 'ఆజాదీ కా రైల్‌గాడీ' పేరుతో ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు పేర్కొన్నారు.

సామూహిక ఉద్యమంగా

సామూహిక ఉద్యమంగా


ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 75 రైల్వే స్టేషన్లను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దినట్లు వెల్లడించారు. కర్ణాటకలో రాష్ట్రవ్యాప్తంగా 75 ప్రదేశాల్లో.. ఆయా ప్రాంతాలకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుల్ని స్మరించుకుంటూ ప్రత్యేక కార్యక్రమాల్ని నిర్వహించినట్లు చెప్పుకొచ్చారు. ఆటబొమ్మల ఎగుమతిలో ఇండియా పవర్‌హౌస్‌గా మారుతోందని ప్రధాని చెప్పారు. రూ.300-400 కోట్ల నుంచి రూ.2,600 కోట్లకు ఈ మేర ఎగుమతుల సామర్ధ్యం చేరుకుందని వివరించారు. భారతీయ చరిత్ర..సంస్కృతి ఆధారంగా ఆట బొమ్మలను తయారు చేస్తున్నారని.. ఇప్పుడు వాటిని మంచి ధరలకు విక్రయిస్తూ ఆర్దికంగా ప్రయోజనాలు అందుకుంటున్నారని ప్రధాని చెప్పుకొచ్చారు.

English summary
PM Modi said under the ‘Azadi Ka Amrit Mahotsav’ from August 13 to 15, a special movement ‘Har Ghar Tiranga’ is being organised.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X