ప్రధాని మోదీ ఇక ఢిల్లీలో కాదు, అక్కడ నుంచే ఆపరేషన్..!!
ప్రధాని మోదీ వరుస సమావేశాలతో సంచలన నిర్ణయాలకు సిద్దమయ్యారు. సరిహద్దుల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పహల్గామ్ ఉగ్ర దాడి తరువాత ప్రధాని మోదీ తమ లక్ష్యం తేల్చి చెప్పారు. ఉగ్రవాదులు..వారి వెనుక ఉన్న వారిని వదిలేది లేదని స్పష్టం చేసారు. భారత్ తీసుకుంటున్న నిర్ణయాలతో పాకిస్తాన్ ఆత్మరక్షణలో పడింది. భారత్ దౌత్య పరమైన చర్యలతో పాక్ ను ఏకాకి చేసింది. ఇటు త్రివిధ దళాలకు ప్రధాని స్వేచ్ఛ ఇచ్చారు. ప్రతీకారం నిర్ణయం సైన్యం కే అప్ప గించారు. ఈ సమయంలోనే ప్రధాని మోదీ మరో నిర్ణయం తీసుకున్నారు.
సంచలన నిర్ణయం దిశగా
పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల పైన విరుచుకుపడటానికి భారత సైన్యం సిద్దం అవుతోంది. సైనిక చర్య అనివార్యంగా కనిపిస్తోంది. ప్రధాని వరుస సమావేశాలతో పూర్తి సమాయాత్తం అయ్యారు. ప్రపంచ దేశాలు మోదీ నిర్ణయాల పైన ఆసక్తిగా చూస్తున్నారు. చైనా జోక్యం కీలకంగా మారుతోంది. ఐక్య రాజ్య సమితి శాంతి సందేశాలు ఇస్తోంది. ప్రధాని మోదీ తన మంత్రివర్గ భేటీలో ఉగ్రవాదాన్ని పూర్తి గా రూపుమాపేలా నిర్ణయం ఉంటుందని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ రాత్రి నుంచి ఏ క్షణం అయిన పాక్ మద్దతు ఉగ్రవాద శిబిరాలు, పీఓకే లోని టెర్రరిస్ట్ క్యాంప్స్ పైన భారత్ చర్యలకు దిగటం ఖాయమని తెలుస్తోంది. అటు పాకిస్థాన్ లోలోపల ఆందోళన చెందుతూనే పైకి మాత్రం గాంభీర్యం ప్రదర్శిస్తోంది.

మూడు రాష్ట్రాల్లో
ఈ సమయంలోనే ప్రధాని మోదీ తన రష్యా పర్యటన రద్దు చేసుకున్నారు. రేపటి నుంచి రెండు రోజుల పాటు మూడు రాష్ట్రాల పర్యటనకు వెళ్తున్నారు. ఢిల్లీ బయటే ఉన్నా... ప్రతీ క్షణం అక్కడి నుంచే సరిహద్దులో పరిస్థితులు.. పరిణామాలను గమనించనున్నారు. అవసరమైన దిశా నిర్దేశం చేయనున్నారు. ప్రధాని మోదీ రేపటి నుంచి రెండు రోజుల పాటు మూడు రాష్ట్రాల్లో పర్యటనకు సిద్దం అయ్యారు. మహారాష్ట్ర, కేరళ, ఏపీలో పర్యటించనున్నారు. ముంబై లోని వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ (వేవ్స్)ను పీఎం ప్రారంభిస్తారు. దాదాపు 25 దేశాలకు చెందిన మంత్రుల భాగస్వామ్యంతో గ్లోబల్ మీడియా డైలాగ్ సదస్సు జరుగనుంది. అలాగే కేరళలోని విజింజం అంతర్జాతీయ డీప్ వాటర్ మల్టీపర్పస్ ఓడరేవును ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్నారు.
ప్రధాని పర్యవేక్షణ
మే 2న ఏపీ రాజధాని అమరావతిలో 58,000 కోట్ల రూపాయల విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు ప్రధాని. ఏపీ బహుళ రోడ్డు , రైలు ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసి.. అక్కడ నిర్వహించే బహరింగ సభలో ప్రధాని మోదీ చేయనున్నారు. డీఆర్‌డీవో, డీపీఐఐటీ, ఎన్‌హెచ్‌ఐ, రైల్వేస్‌కు సంబంధించి రూ.57,962 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అలాగే రూ.3680 కోట్ల విలవైన పలు నేషనల్ హైవే పనులను ప్రారంభించనున్నారు. సరిహద్దుల్లో ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతున్న వేళ.. మోదీ ఢిల్లీ వీడి ఈ రాష్ట్రాల నుంచే జరుగుతున్న ఆపరేషన్ ను నిరంతరం మానిటర్ చేయనున్నట్లు తెలుస్తోంది. వచ్చే 24 నుంచి 48 గంటల సమయం సైనిక పరంగా తీసుకునే నిర్ణయాల పై ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications