పాక్ ప్రతీకార దాడులు, సిద్దం - ఆపరేషన్ సింధూర్ 2, ఈ సారి గురి అక్కడే..!!

ఆపరేషన్ సింధూర్ కీలక మలుపు తీసుకుంటోంది. దాదాపు అయిదు దశాబ్దాల తరువాత పాక్ భూ భాగంలోని ఉగ్రవాద శిబిరాల పైన భారత సైన్యం విరుచుకు పడింది. పక్కా ప్లాన్ తో అనుకున్న ముహూర్తానికి భారత్ వైమానిక దళం ఉగ్రవాద క్యాంపుల పైన క్షిపణులతో దాడి చేసింది. పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులను మట్టు బెట్టింది. ప్రధాని మోదీ స్వయంగా ఈ ఆపరేషన్ సింధూర్ ను పర్యవేక్షించారు. భారత్ సైన్యానికి దేశ వ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. ఇదే సమయంలో పాక్ కదలికల పైన భారత్ అప్రమత్తం అవుతోంది. కొత్త ప్రణాళికలతో సిద్దం అవుతోంది.

భారత్ అర్ద్రరాత్రి పాక్ తో సహా పీఓకేలో ఉన్న ఉగ్రవాద శిబిరాలను నేల మట్టం చేసింది. ముంబై దాడికి కేంద్రంగా నిలిచిన జైషే ప్రధాన కార్యాలయం మొదలు పీఓకేలో తిష్ట వేసిన ఉగ్రవాదుల శిబిరాల పైన విరుచుకు పడింది. మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్న ముఖ్యమైన ఉగ్రవాదులతో సహా పెద్ద సంఖ్యలో కమాండర్లను మట్టు బెట్టారు. ఇక, ఇప్పుడు పాకిస్థాన్ ఏం చేయబోతుందనేది భారత్ నిశితంగా పరిశీలిస్తోంది. ఇప్పటి వరకు మాటలకే పాక్ పరిమితం అయింది. భారత్ పైన ప్రతీకార చర్యలు తప్పవంటూ పాక్ మంత్రులు చెప్పుకొస్తున్నారు. అయితే, ఒక్క విమానం కూడా ఇప్పటికీ ఎగరలేదు. పాక్ నుంచి ఎలాంటి ప్రతిస్పందన వచ్చినా తిప్పి కొట్టటానికి భారత్ సర్వం సిద్దంగా ఉంది. ఇందు కోసం ఆపరేష్ సింధూర్ స్వయంగా మానిటర్ చేస్తున్న ప్రధాని కీలక మంత్రాంగం నిర్వహించారు. ప్రతీ క్షణం అప్డేట్స్ పైన సమీక్షిస్తున్నారు.

pm-modi-monitoring-operation-sindoor-message-to-pakistan-is-loud-and-clear

పాకిస్తాన్ ఎలాంటి ప్రతీకార చర్యలకు సిద్దమైనా వెంటనే తిప్పి కొట్టేలా కార్యాచరణ సిద్దం అవుతోంది. అటు దాడుల గురించి భారత్ విదేశాంగ - ఆర్మీ అధికారులు వెల్లడించారు. పాక్ లోని ఉగ్రవాద శిబిరాలనే టార్గెట్ చేసినట్లు వెల్లడించారు. కాగా, పాక్ ప్రతీకార చర్యలకు సిద్దం అయితే, వెంటనే పీఓకే లక్ష్యంగా భారత్ సైన్యం పూర్తి స్థాయి చర్యలకు సిద్దం అయ్యే అవకాశం ఉంది. పీఓకే ను స్వాధీనం చేసుకోవటమే లక్ష్యంగా అడుగులు ఖాయమని తెలుస్తోంది. పాకిస్తాన్ లో మాత్రం ఆ రకమైన స్పందన లేదని నిపుణులు భావిస్తున్నారు. పాక్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతీ కార చర్యలకు దిగితే భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. తాము ఉగ్రవాద శిబిరాల పైనే దాడి చేసామని భారత్ స్పష్టం చేసింది. అటు పాక్ ఖచ్చితంగా దీనికి ప్రతిగా స్పందిస్తామని చెబుతున్న వేళ.. రానున్న 24 గంటల్లో చోటు చేసుకునే పరిణామాల పైన ఉత్కంఠ కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+