ప్రధాని టార్గెట్ ఇక ఆ రెండు రాష్ట్రాలు - నేటి నుంచే ఫోకస్ : ఛాన్స్ ఇవ్వకూడదనే..!!
ప్రధాని మోదీ తాజా ఫలితాల తరువాత కొత్త ఉత్సాహంతో కనిపిస్తున్నారు. అనుకూల ఫలితాల తరువాత విశ్రమించటానికి సమయం తీసుకోవటం లేదు. తన లక్ష్యాలకు అనుగుణంగా అడుగులు వేస్తున్నారు. అయిదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో అధికారం దక్కించుకున్నారు. ఇక, ఇప్పుడు మరో రెండు రాష్ట్రాల పైన ఫోకస్ పెట్టారు. ఈ రోజు నుంచి రెండు రోజుల పాటు ప్రధాని మోదీ తన సొంత రాష్ట్రం గుజరాత్ లో పర్యటించనున్నారు. ఇక, ఈ ఏడాది చివర్లో గుజరాత్..హిమాచల్ ప్రదేశ్ లో ఎన్నికలు జరగనున్నాయి.
Recommended Video

తాజా జోష్ కొనసాగించేలా
దీంతో..తన సొంత రాష్ట్రంలో మరోసారి అధికారంలో తామే కొనసాగే విధంగా వ్యూహాలు ఇప్పటి నుంచే సిద్దం చేస్తున్నారు. ప్రస్తుత ఫలితాలతో పార్టీ నేతలు - కేడర్ లో వచ్చిన జోష్ ను కంటిన్యూ చేయాలని డిసైడ్ అయ్యారు. ఇదే సమయంలో గుజరాత్ లో కాంగ్రెస్ తో పాటుగా ప్రత్యర్ది పార్టీలకు అవకాశం ఇవ్వకూడదని డిసైడ్ అయ్యారు. తన సొంత రాష్ట్రం కావటంతో అక్కడ మెజార్టీ ప్రధానికి వ్యక్తిగతంగా ప్రతిష్ఠాత్మకంగా మారనుంది.గుజరాత్ శాసనసభ పదవీకాలం వచ్చే ఏడాది ఫిబ్రవరి 18తో ముగుస్తుంది. దీంతో పాటుగా హిమాచల్ ప్రదేశ్ శాసనసభ పదవీకాలం జనవరి 8, 2023 వరకు ఉంది.

గుజరాత్ ఎన్నికల పై ఫోకస్
దీంతో..పరధాని మోదీ ఈ రోజు నుంచి రెండు రోజుల పాటు గుజరాత్‌లో పర్యటించనున్న ప్రధాని మోడీ అక్కడ గ్రాండ్‌గా రోడ్‌షో నిర్వహించనున్నారు. ఇందులో 4 లక్షల మంది ప్రజలు తరలివస్తారని చెబుతున్నారు. ఉదయం 10 గంటలకు ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్న ప్రధాని మోడీ, ఆ తర్వాత విమానాశ్రయం నుంచే రోడ్ షోను ప్రారంభిస్తారు. సమాచారం ప్రకారం, ప్రధాని కాన్వాయ్ 1 గంటలో 9 కిలోమీటర్ల దూరాన్ని చేరుకుంటుంది. ఉదయం 11.15 గంటలకు గాంధీనగర్‌లోని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం చేరుకుంటారు.

భారీ రోడ్ షో లకు ప్రణాళికలు
ప్రధాని ఈ రోడ్‌షోకు నాలుగు లక్షల మంది అభిమానులు, కార్యకర్తలు తరలివస్తారని గుజరాత్ బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి. ప్రధానమంత్రి వెళ్లే మార్గంలో దాదాపు 50 స్టేజీలతో పాటు రూట్ మొత్తం కాషాయ జెండాలతో నిండిపోయింది. రోడ్ షో తర్వాత, ప్రధాని మోడీ కమలం భవన్‌లో రాష్ట్ర భారతీయ జనతా పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించి ఎన్నికల వ్యూహంపై చర్చిస్తారు. గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున నాలుగు రాష్ట్రాల విజయోత్సవాన్ని గుజరాత్‌కు తీసుకెళ్లటమే లక్ష్యంగా ప్రధాని పర్యటన జరగనుంది.

27 ఏళ్లుగా గుజరాత్ లో అధికారంలో
గుజరాత్‌లో గత 27 ఏళ్లుగా బీజేపీ ప్రభుత్వం ఉంది. గత ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ నుంచి గట్టిపోటీనే ఎదురైంది. కానీ, ఈ సారి కాంగ్రెస్ తో పాటుగా ఆప్ సైతం ఇక్కడ ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్దం చేసుకుంటుంది. పంజాబ్ లో గెలిచిన ఆప్ లో కొత్త జోష్ కనిపిస్తోంది. జాతీయ పార్టీగా అవతరించేందుకు గుజరాత్ లో ప్రయత్నాలు చేయాలని భావిస్తోంది. దీంతో..నాలుగు రాష్ట్రాల్లో గెలిచినా..విశ్రమించకుండా ప్రధాని గుజరాత్ పర్యటన మొదలు పెట్టారు. తాజాగా వచ్చిన ఫలితాలే 2024 ఎన్నికల్లోనూ రిపీట్ అవుతాయని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications