గురునానక్ బోధనలు ఆదర్శనీయం, కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభోత్సవంలో మోడీ, అయోధ్య తీర్పుపై నో కామెంట్స్
గురునానక్ బోధనలను అనుసరించాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. గురునానక్ మనందరికీ ఆదర్శమని పేర్కొన్నారు. కర్తార్‌పూర్ నుంచి గురునానక్ ఎప్పుడైతే వెళ్లారే ఆయన సమాజ స్థితిగతులను మారుస్తారని ఎవరూ అనుకోలేదని చెప్పారు. అందరూ కలిసిమెలిసి ఐకమత్యంగా సోదరభావంతో ఉండాలని గురునానక్ పిలుపునిచ్చారని తెలిపారు.
పంజాబ్‌లోని గురుదాస్ పూర్ వద్ద గల కారిడార్ ప్రారంభించాక మోడీ ప్రసంగించారు. కారిడార్ ప్రారంభోత్సవం సందర్భంగా పంజాబ్ సీఎం అమరిందర్ సింగ్, మాజీ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్‌తో కలిసి పాల్గొన్నారు. తన ప్రసంగంలో ప్రధాని మోడీ అయోధ్య తీర్పు గురించి ఒక వ్యాఖ్యంతో ప్రసంగాన్ని ముగించారు. ఇది మనందరికీ దేశం పట్ల భక్తిని చాటుతుందని చెప్పారు. సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పును అందరూ గౌరవించాల్సిందేనని మోడీ పరోక్షంగా చెప్పారు.

భారతీయుల మనోభావాలను గౌరవించిన పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌కు మోడీ ధన్యవాదాలు తెలిపారు. కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆహ్వానించినందుకు థాంక్స్ చెప్పారు. గురునానక్ 550వ జయంతి సందర్భంగా గురుదాస్ పూర్ డేరా బాబా నానక్ వద్ద కర్తార్‌పూర్ కారిడార్‌ను ప్రారంభించారు. అంతకుముందు గురునానక్ జయంతి సందర్భంగా స్మారక నాణెం కూడా ఆవిష్కరించారు.
పాకిస్థాన్‌తో మంచి సంబంధాలను కోరుకుంటున్నామని పంజాబ్ సీఎం అమరిందర్ సింగ్ పేర్కొన్నారు. ఉగ్రవాదం, ముష్కరులను పాకిస్థాన్ పెంచి పోషించడం సరికాదని మండిపడ్డారు. ప్రస్తుత సమయంలో మనం పంచాల్సింది ప్రేమనే తప్ప.. ద్వేషాన్ని కాదని స్పష్టంచేశారు. ఉగ్రవాద చర్యలను ఆపివేసి.. రహదారుల నిర్మాణం, మౌలిక వసతుల కల్పనపై దృష్టిసారించాలని కోరారు. అభివృద్ధిపై ఫోకస్ చేస్తే సమాజానికి మంచి జరుగుతుందని అభిప్రాయపడ్డారు.
-
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన












Click it and Unblock the Notifications