ట్రంప్ కు మోడీ మరో ఝలక్.. ! ఆసియాన్ పై కీలక నిర్ణయం..!

రష్యా చమురు కొనుగోలు చేస్తున్నామనే కారణంతో భారత్ పై 50 శాతం సుంకాలు విధించిన ట్రంప్ కు ప్రధాని నరేంద్ర మోడీ సందర్భం వచ్చినప్పుడల్లా ఝలక్ లు ఇస్తూనే ఉన్నారు. ఓవైపు ఫోన్ కాల్స్ లో మాట్లాడుతున్నా.. మరోవైపు నేరుగా కలిసి చర్చలు జరిపేందుకు మాత్రం విముఖత చూపుతున్నారు. అదే సమయంలో సుంకాల తగ్గింపు విషయంలో ట్రంప్ సానుకూల సంకేతాలు పంపుతున్నా వాటిని మోడీ నమ్మడం లేదు. ఈ విషయం మరోసారి రుజువైంది.

తాజాగా ఈజిప్ట్ లో గాజా ఒప్పందం కోసం జరిగిన శాంతి సదస్సుకు రావాలని నేరుగా ట్రంప్ ఆహ్వానించినా వెళ్లకుండా దూరంగా ఉండిపోయిన ప్రధాని మోడీ.. ఇప్పుడు ఈ వారాంతంలో మలేషియా రాజధాని కౌలాలంపూర్ లో జరిగే ఆసియాన్ సదస్సుకు కూడా దూరంగా ఉండాలని నిర్ణయించారు. దీనికి పరోక్ష కారణం ఈ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరవుతుండటమే అని తెలుస్తోంది. దీంతో ఈ సదస్సుకు వర్చువల్ గా హాజరు కావాలని మోడీ నిర్ణయించారు.

PM Modi Opts for Virtual Participation in ASEAN Summit Skips Trump Talks

ఈ మేరకు స్వయంగా ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. "నా ప్రియమైన స్నేహితుడు, మలేషియా ప్రధాన మంత్రి అన్వర్ ఇబ్రహీంతో హృదయపూర్వక సంభాషణ జరిగింది. మలేషియా ASEAN అధ్యక్షత వహించినందుకు ఆయనకు అభినందనలు... ASEAN-భారత్ శిఖరాగ్ర సమావేశంలో వర్చువల్‌గా పాల్గొనడానికి మరియు ASEAN-భారత్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా బలోపేతం చేయడానికి ఎదురుచూస్తున్నాను" అని ప్రధాని మోదీ ట్వీట్ లో పేర్కొన్నారు.

PM Modi Opts for Virtual Participation in ASEAN Summit Skips Trump Talks

కరోనా సమయంలో మినహాయిస్తే రెగ్యులర్ గా ఆసియాన్ సదస్సులకు హాజరయ్యే ప్రధాని మోడీ.. ఈసారి మాత్రం ఏ కారణం లేకుండానే గైర్హాజరు అవుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ట్రంప్ ను చివరి సారిగా ప్రధాని మోడీ వాషింగ్టన్ కు వెళ్లి కలిశారు. ఆ తర్వాత ఇద్దరు నేతలు కలుసుకోలేదు. ట్రంప్ కు దొరకడం ఆయనకు ఇష్టం లేదని, అందుకే ఇలా ఆయన హాజరయ్యే కార్యక్రమాలకు మోడీ వెళ్లడం లేదని కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ ఆరోపించారు. భారత్-పాకిస్తాన్ యుద్దం ఆపానని ట్రంప్ 53 సార్లు, రష్యా చమురు భారత్ కొనడం ఆపేస్తుందని ఐదుసార్లు చెప్పుకున్నారని, ఇప్పుడు ఆయన్ను కలిస్తే మోడీ వీటిపై వివరణ ఇవ్వాల్సి వస్తుందని జైరాం రమేశ్ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+