బిగ్ డే.. పాకిస్థాన్ అష్టదిగ్భంధనం.. ఏ క్షణమైనా సర్జికల్ స్ట్రైక్ ? లేదా యుద్ధం?
జమ్ము కాశ్మీర్ పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దీంతో పాకిస్థాన్ భారత్ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. దేశవ్యాప్తంగా ప్రజలు ప్రతీకార జ్వాలతో రగిలిపోతున్నారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోన్న పాకిస్థాన్ ను దెబ్బకు దెబ్బ తీయాలన్న కసితో భారత ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సరిహద్దుల్లో పరిస్థితి నివురు గప్పిన నిప్పులా ఉంది. యుద్ధం ఏ క్షణమైనా మొదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో ఇప్పటికే త్రివిధ దళాలతో ప్రధాని మోదీ సమావేశం నిర్వహించారు. త్రివిధ దళాలకు ప్రధాని మోదీ పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. టైమ్, డేట్ మీరే ఫిక్స్ చేయండని ఆదేశాలు ఇచ్చారు. పాకిస్థాన్ కు ఎలాంటి జవాబు ఇవ్వాలో సైన్యమే నిర్ణయిస్తుందని అన్నారు. ఉగ్రవాదాన్ని అణచివేయాలన్నదే తమ ధ్యేయమని అన్నారు. ఈ సమావేశం దాదాపు గంటన్నర పాటు జరిగింది. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ సమావేశం అనంతరం ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తోనూ ప్రధాని మోదీ కీలక సమావేశం నిర్వహించారు. పహల్గాం ఉగ్రదాడి అనంతరం నెలకొన్న పరిణామాలపై ఇరువురు చర్చించుకున్నారు. ఉగ్రవాద అంతానికి తమ సంపూర్ణ సహకారం అందిస్తామని మోహన్ భగవత్ ప్రధాని మోదీకి హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.
ఇక ఇవాళ కూడా ప్రధాని మోదీ నివాసంలో వరుస భేటీలు జరగనున్నాయి. ఇప్పటికే హోం మంత్రి అమిత్ షా మోదీ నివాసానికి చేరుకున్నారు. రక్షణశాఖతో సమావేశం ముగియగానే హోంశాఖతో ప్రధాని మోదీ మీటింగ్ నిర్వహించనున్నారు.
ఇప్పటికే త్రివిధ దళాలకు ప్రధానిమోదీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. సైన్యంపై పూర్తినమ్మకంతో ప్రధాని మోదీ ముందుకెళ్తున్నారు. ఈ మేరకు ఇవాళ సాయంత్రం లోపు ప్రధాని మోదీ సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం అందుతోంది. ప్రధాని మోదీ నిర్ణయంపై దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

ఇప్పటికే కఠినమైన చర్యలతో పాకిస్థాన్ ను ఆర్థికంగా కోలుకోలేని దెబ్బతీసింది భారత ప్రభుత్వం. సింధూ జలాల రద్దు, వీసాలు రద్దు, అటారీ- వాఘా బోర్డర్ మూసివేత కారణంగా పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. పాకిస్థాన్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అతి కొద్దిరోజుల్లోనే ఆ దేశంలో ఆర్థిక మాంద్యంలో కొట్టుకుపోనుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
हाई लेवल मीटिंग का वीडियो जारी करने की क्या जरूरत हैं?pic.twitter.com/OL1VKU91lz
— Santosh Yadav, Ph.D. (@sky_phd) April 29, 2025
ఇక భారత్ భయంతో.. పాక్ ఆక్రమిత కాశ్మీర్(POK)లో ఉన్న ఉగ్రవాద స్థావరాలను పాకిస్థాన్ ఆర్మీ ఖాళీ చేయిస్తోంది. అక్కడ ఉన్న ఉగ్రవాదులను బంకర్లు, ఆర్మీ షెల్టర్లలోకి హుటాహుటిన తరలిస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి. భారత్, పాక్ ఉద్రిక్తతల వేళ యుద్ధం రావచ్చనే ఊహాగానాలతో పీఓకేలోని ఉగ్రవాదులను ఎలాగైనా కాపాడుకునేందుకు పాకిస్థాన్ ఆర్మీ ఇలా చేస్తున్నట్లు సమాచారం.
మరోవైపు పహల్గాం ఉగ్రదాడి NIA దర్యాప్తు ముమ్మరం చేసింది. ఉగ్రదాడి జరిగిన వీడియోలను ఎన్‌ఐఏ విశ్లేషిస్తోంది. జిప్‌లైన్ ఆపరేర్లను విచారణ చేస్తున్న ఎన్‌ఐఏ.. బైరసన్ లోయలో ఉగ్రవాదులు వాడిన 40 క్యాట్రిడ్జ్‌లను గుర్తించింది.












Click it and Unblock the Notifications