దటీజ్ యోగి: మోడీ ప్రశంసలు, కేజ్రీకి మరోసారి అవమానం

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసల జల్లు కురిపించారు. యోగి ఆధునికవాది కాదనేవారందరికీ నేటి ఆయన అడుగు కనువిప్పు మోడీ అన్నారు. యోగి అంటే ఏమిటో ఇప్పటికే అందరికీ అర్ధమై ఉంటుందని తాను అనుకుంటున్నట్లు తెలిపారు.

క్రిస్టమస్‌ సందర్భంగా మోడీ, సీఎం యోగి ఆదిత్యనాథ్‌ నోయిడాకు కొత్త మెట్రో రైలును ప్రారంభించారు. నోయిడాకు శాపగ్రస్త నగరమనే పేరున్న కారణంగా గతంలోని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రులు ఎవరు కూడా నగరంలో అడుగుపెట్టే ధైర్యం చేయలేదు. యోగి దాన్ని లెక్కచేయకుండా నోయిడాలో మెట్రో ప్రారంభ కార్యక్రమానికి హాజరయ్యారు. దాంతో యోగిని మోడీ ప్రశంసించారు.

దుస్తులను బట్టి అలా భావిస్తారా...

దుస్తులను బట్టి అలా భావిస్తారా...

యోగి ధరించిన దుస్తులను బట్టి ఆయన ఆధునికవాది కాదని అందరూ అనుకుంటారని, అయితే గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయని సాహసం యోగి చేశారని, నోయిడాకు శాపం ఉందనే నమ్మకాన్ని బేఖాతరు చేస్తూ ఆయన నగరంలో అడుగుపెట్టారని, నమ్మకం అనేది ఉండాలి గానీ గుడ్డి నమ్మకం ఆహ్వానించదగినది కాదని మోడీ అన్నారు.

నాకు కూడా చెప్పేవారు..

నాకు కూడా చెప్పేవారు..

తాను గుజరాత్ ముఖ్యమంత్రి మొదట్లో కొన్ని ప్రాంతాల్లో కాలు పెట్టవద్దని చాలా మంది చెప్పారని, తాను ఆ మాటలను పట్టించుకోలేదని, వారు వద్దు అని చెప్పిన ప్రతి చోటుకీ వెళ్లి చూశానని, ఎన్నో ఏళ్లుగా క్షుద్రపూజలపై, మంత్ర శక్తులపై, శాపాలపై నమ్మకంతో పలువురు నాయకలు కొన్ని ప్రాంతాలకు వెళ్లలేదని, ఇది ఎంతటి దురదృష్టమని మోడీ అన్నారు. మూఢ నమ్మకాలతో కొన్ని ప్రాంతాలకు దూరంగా ఉండేవాళ్లు ముఖ్యమంత్రులుగా ఉండేందుకు అర్హులు కారని ఆయన అన్నారు.

వారంతా ఇలా ప్రయాణం...

వారంతా ఇలా ప్రయాణం...


ప్రధాని నరేంద్ర మోడీ, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఇతర ప్రభుత్వ అధికారులు తొలిసారి మెట్రో మాజెంటా రైలులో నోయిడా నుంచి ఓక్లా బర్డ్‌ శాంక్చూరి స్టేషన్‌ వరకు ప్రయాణించారు. అయితే, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు తీవ్ర అవమానం జరిగింది. ఆయనను ఈసారి కూడా మెట్రో రైల్‌ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించలేదు.

కేజ్రీకి ఇది మూడోసారి...

కేజ్రీకి ఇది మూడోసారి...

ఢిల్లీలో మెట్రో కొత్త లైన్‌ను ప్రారంభించడం, ఆ ప్రారంభ కార్యక్రమాలకు కేజ్రీవాల్‌ను ఆహ్వానించకపోవడం ఇది మూడోసారి. మూడుసార్లు కూడా ప్రధాని మోడీ హాజరయ్యారు. దానిపై ఆమ్‌ ఆద్మీ పార్టీ నేతలు మోడీపై తీవ్రంగా మండిపడింది. కేజ్రీవాల్‌ పట్ల బీజేపీ ప్రభుత్వ పక్షపాత వైఖరితో వ్యవహరిస్తోందని విమర్శించింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Praising ogi Adityanath for braving the “Noida jinx” that kept previous CMs away from Noida, the PM Narendra Modi said even though faith was important, there was no space for blind faith.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి