రష్యా - ఉక్రెయిన్ వివాదం : యూపీలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
రష్యా - ఉక్రెయిన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిన్ పుతిన్ తూర్పు ఉక్రెయిన్‌లో ఉన్న రెండు వేర్పాటు వాద ప్రాంతాలను ప్రత్యేక దేశాలుగా గుర్తిస్తున్నట్లు ప్రకటించారు. ఆ ప్రాంతాలకు రష్యా సేనలను పంపాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం తారాస్థాయికి చేరింది. అటు యుద్ధాన్ని నివారించేందుకు దౌత్యపరమైన ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఎప్పుడేమి జరుగుతుందో చెప్పలేం..
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నిక ప్రచారంలో భాగంగా బహరాయిచ్‌లో జరిగిన సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రష్యా-ఉక్రెయిన్ మధ్య నెలకొన్న యుద్ధ పరిస్థితుల గురించి ప్రస్థావించారు. ప్రపంచం ఎంత అల్లకల్లోలంగా ఉందో... ఏం జరుగుతుందో అందరం చూస్తూనే ఉన్నామన్నారు. ఎప్పుడేమి ప్రమాదం వస్తుందో, ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు.

భారత్ మరింత బలమైన దేశంగా మారాలి..
అందుకే భారతదేశం మరింత బలమైన శక్తిగా మారాల్సిన అవసరం ఉందన్నారు ప్రధాని మోదీ. దేశ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం సమర్థవంతమైన నాయకుడి భుజస్కంధాలపై ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇండియా బలపడటం కేవలం దేశ ప్రజల కోసమే కాదు.. ప్రపంచం దృష్టిలో కూడా ఇది అవసరం అని స్ఫష్టం చేశారు. కఠినమైన సమయం ఉత్పన్నమైనప్పుడు సమర్థవంతమైన నాయకుడే కావాలని పేర్కొన్నారు. ఇంత పెద్ద విశాల దేశం, ఇంత పెద్ద యూపీ రాష్ట్రంతలో ఓ పటిష్టమైన, బలమైన నాయకుడి భుజ స్కంధాలపై ఉండాలని మోదీ అన్నారు. ప్రజలంతా వేసే ఒక్కొక్క ఓటు భారత్ ను బలపరుస్తుందని చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications