Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వేటగాడు.. ప్రధాని మోదీ: వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్‌గా: చీతాలకు స్వేచ్ఛ..!!

భోపాల్: ఆఫ్రికన్ దేశం నమీబియా నుంచి తీసుకొచ్చిన ఎనిమిది చీతాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. కొద్దిసేపటి కిందటే అభయారణ్యంలో విడుదల చేశారు. ఈ ఎనిమిదింట్లో అయిదు ఆడ, మూడు మగ చిరుతలు ఉన్నాయి. తన పుట్టినరోజును పురస్కరించుకుని ఈ చీతాలను.. మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో విడుదల చేశారు. ఎన్‌క్లోజర్లల్లో ఉన్న వాటికి స్వేచ్ఛ కల్పించారు. అక్కడే ప్రాజెక్ట్ చీతాను ప్రారంభించారు.

అతిపెద్ద వైల్డ్ లైఫ్ ప్రాజెక్ట్..

అతిపెద్ద వైల్డ్ లైఫ్ ప్రాజెక్ట్..

అనంతరం మాట్లాడారు. ఈ దశాబ్దంలోనే అతిపెద్ద వైల్డ్ లైఫ్ ప్రాజెక్ట్‌గా దీన్ని అభివర్ణించారాయన. చీతాలను స్వదేశానికి తిరిగి తీసుకుని రావడం, వాటిని మళ్లీ భారత గడ్డపైనే సంరక్షించేలా చర్యలు తీసుకున్నామని వివరించారు. వన్యప్రాణుల సంరక్షణ అనేది ప్రతి పౌరుడి లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు. ప్రజల మనుగడ అనేది అడవులు, పర్యావరణం, వన్యప్రాణులతోనే ముడిపడి ఉందని పేర్కొన్నారు. ఇప్పుడు ప్రపంచంలో చీతాల సంఖ్య తగ్గిపోతోండటం ఆందోళనకరమని వ్యాఖ్యానించారు.

 ట్రాన్స్‌లొకేషన్ ప్రాజెక్ట్..

ట్రాన్స్‌లొకేషన్ ప్రాజెక్ట్..

కొన్ని ఆఫ్రికన్ దేశాలు, ఇరాన్‌లో మాత్రమే చీతాల సంఖ్య పరిమితంగా ఉంటోందని అన్నారు. వాటి సంఖ్య, సంతతిని పెంపొందించడానికే ఇంటర్-కాంటినెంటల్ ట్రాన్స్‌లొకేషన్ ఆఫ్ చీతాస్ ‌ప్రాజెక్ట్‌ను చేపట్టామని ప్రధాని మోదీ వివరించారు. ఒకప్పుడు భారత్- ఆసియాటిక్ చిరుతలకు నిలయంగా ఉండేదని, 1952 నాటికి అవి అంతరించిపోయిన వన్యప్రాణుల జాబితాలో చేర్చడం బాధాకరమని అన్నారు. ఇప్పుడు వాటిని సంరక్షించాల్సిన బాధ్యత తమపై ఉందని మోదీ చెప్పారు.

చీతాల సంతతిని అభివృద్ధి చేయడానికి..

దేశీయంగా చీతాల సంతతిని అభివృద్ధి చేయడానికి ఇక కునో నేషనల్ పార్క్ ప్రధానకేంద్రంగా ఆవిర్భవిస్తుందని మోదీ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అలాంటి పరిస్థితులను కల్పిస్తామని పేర్కొన్నారు. చీతాలు అతిథిగా అడుగు పెట్టాయని, ఇక్కడి వాతావరణం కొత్తగా అనిపించవచ్చని వ్యాఖ్యానించారు. వన్యప్రాణుల సంరక్షణ కోసం అందుబాటులో ఉన్న అంతర్జాతీయ మార్గదర్శకాల ప్రకారం.. ఇక్కడి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వాటిని సంరక్షించాల్సి ఉంటుందని మోదీ అన్నారు.

నమీబియా నుంచి వాటిని మోసుకొచ్చిన స్పెషల్ కార్గో ఎయిర్ క్రాఫ్ట్.. తొలుత మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో ల్యాండ్ అయింది. అక్కడి నుంచి చినూక్‌తో సహా రెండు హెలికాప్టర్లలో చిరుతలను షియోపూర్ జిల్లాలోని పాల్పూర్ గ్రామానికి తరలించారు అధికారులు. పాల్పూర్ నుంచి వాటిని రోడ్డు మార్గంలో కునో నేషనల్ పార్క్‌కు తరలించారు. కునో అభయారణ్యంలో మోదీ వాటిని విడిచిపెట్టారు.

 మోదీ న్యూలుక్..

మోదీ న్యూలుక్..

ఈ సందర్భంగా ఆయన వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్‌ అవతారం ఎత్తారు. వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్లు ధరించే జాకెట్ వేసుకున్నారు. తలపై రౌండ్ క్యాప్ ధరించారు. కూలింగ్ గ్లాసెస్‌తో డిఫరెంట్ లుక్‌తో కనిపించారాయన. చీతాలను విడిచిపెట్టిన తరువాత వాటిని కెమెరాల్లో బంధించారు మోదీ. చీతాలను తరలించడానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కొందరు మంత్రులు, అధికారులు ఇందులో పాల్గొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+