ప్రతి ముస్లిం మహిళకు అండగా ఉంటాం.. హిజాబ్ వివాదంపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
కర్ణాటకలో హిజాద్ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ప్రతి ముస్లిం మహిళకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు . వారి సంక్షేమానికి, అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వాలు చేయని ఎన్నో సంస్కరణలు తాము ముస్లిం మహిళల కోసం తీసుకువచ్చామన్నారు.

ప్రతి ముస్లిం మహిళకు అండగా ఉంటాం
ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సహరాన్‌పూర్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ముస్లిం మహిళలను ట్రిపుల్ తలాక్ నుంచి విముక్తి చేసింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమేనని ఆయనత గుర్తుచేశారు. ముస్లిం మహిళలు తమ ప్రభుత్వానికి బహిరంగంగా మద్దతివ్వడంతో ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నారు. అయినప్పటికీ తాము ప్రతి ముస్లిం మహిళకు అండగా ఉంటామని తేల్చిచెప్పారు.

హిజాబ్ ధరించడంపై వివాదం జరుగుతున్న నేపథ్యంలో..
కర్ణాటకలోని విద్యార్థినులు ఓ పాఠశాల తరగతి గదుల్లో హిజాబ్ ధరించడంపై వివాదం జరుగుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోని ముస్లీం మహిళల హక్కులను, అభివృద్ధి, సంక్షేమాన్ని అడ్డుకునేందుకు కొంతమంది కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారని ప్రధాని మోదీ ఆరోపించారు. ముస్లీం మహిళలు అణిచివేతకు గురికాకుండా ఉండాలంటే యూపీలో బీజేపీ ప్రభుత్వం మరలా రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

వారు తమ కుటుంబాల గురించి మాత్రమే ఆలోచిస్తారు
దేశంలోని ప్రతిపక్షాలు తమ కుటుంబాల గురించి మాత్రమే ఆలోచిస్తాయని ప్రధాని మోదీ విమర్శించారు. ప్రజలను పట్టించుకున్న పాపాన పోవడంలేదని దుయ్యబట్టారు. కరోనా మహమ్మారి సమయంలో ఆ పార్టీలు అధికారంలో ఉండి ఉంటే వ్యాక్సిన్లను దారిలోనే అమ్మేసుకునేవారని ఆరోపించారు. అవి ప్రజలకు అందుబాటులోనే ఉండేవి కాదని దుయ్యబట్టారు. ప్రతి పక్షాలు చెప్పేవన్ని బాధ్యతా రహితంగా చెప్పే మాటలేనని విమర్శించారు. వారి వలన ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదన్నారు.
-
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!!












Click it and Unblock the Notifications