వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ కేబినెట్‌లో యంగ్ టర్క్స్: కర్ణాటక నుంచి కొత్త పేరు: తండ్రి స్థానంలో తనయుడు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ సర్కార్‌లో మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన చర్చలు జోరుగా సాగుతోన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెలలోనే తన కేబినెట్‌ను విస్తరించడానికి ముహూర్తం పెట్టిన నేపథ్యంలో- కొత్త పేర్లు వెలుగులోకి వస్తోన్నాయి. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ, 2024 నాటి సాధారణ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రధాని కొత్త టీమ్‌ను ఏర్పాటు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఎన్డీఏ కూటమిలోని భాగస్వామ్యపక్షాలన్నింటికీ ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు- కొందరు యంగ్ టర్క్‌లను బెర్త్ కన్‌ఫర్మ్ చేస్తారని అంటున్నారు. దీనికి సంబంధించిన తుది జాబితాపై కసరత్తు చేస్తోన్నారని తెలుస్తోంది.

తండ్రి స్థానంలో తనయుడికి ఛాన్స్
లోక్‌జనశక్తి పార్టీ అధినేత, దివంగత కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్‌కు కేబినెట్ బెర్త్ లభిస్తుందనే ప్రచారం ఉంది. రెండురోజుల కిందటే ఆయన ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్‌కు వెళ్లడం.. కొందరు బీజేపీ నేతలను కలుసుకోవడంతో ఈ ప్రచారం ముమ్మరమైంది. పశుపతి పాశ్వాన్ పార్టీని చీల్చిన తరువాత ఆయనకు ప్రారంభంలో బీజేపీ నుంచి ఎలాంటి సహకారం అందనప్పటికీ- గుజరాత్ వెళ్లొచ్చిన తరువాత పరిస్థితి మారింది. ఆయనను రామ్ విలాస్ పాశ్వాన్ స్థానాన్ని చిరాగ్‌ పాశ్వాన్‌తో భర్తీ చేయడం దాదాపు ఖాయమైందని జాతీయ మీడియా చెబుతోంది.

 PM Modis Mega Cabinet Expansion: Mysore MP Pratap Simha is likely to represent Karnataka.

కర్ణాటక నుంచి ప్రతాప సింహ
కర్ణాటక నుంచి బీజేపీ లోక్‌సభ సభ్యుడు ప్రతాప సింహను కేంద్ర కేబినెట్‌లోకి తీసుకుంటారని సమాచారం. ప్రస్తుతం ఆయన మైసూరు లోక్‌సభ స్థానానికి ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నారు. వరుసగా రెండుసార్లు ఆయన ఈ స్థానం నుంచి విజయం సాధించారు.

 PM Modis Mega Cabinet Expansion: Mysore MP Pratap Simha is likely to represent Karnataka.

2014, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను మట్టికరిపించారు. మైసూరు లోక్‌సభ నియోజకవర్గం స్థానంపై కాంగ్రెస్, జనతాదళ్ (సెక్యులర్)కు కొద్దో గొప్పో ఉన్న పట్టును తుడిచిపెట్టేయడంతో పాటు బీజేపీ బలోపేతం కావడానికి ప్రతాప సింహ శ్రమించారనే పేరుంది. దీనితో పాటు- వాగ్ధాటి, వివిధ అంశాలపై ఉన్న అవగాహనను దృష్టిలో ఉంచుకుని ఆయనకు బెర్త్ ఇస్తారని తెలుస్తోంది.

English summary
A head of assembly elections in the key states including Uttar Pradesh, next year and the 2024 general elections Prime Minister Narendra Modi is likely to factor as he expands his cabinet for the first time in his second term.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X