మోడీ గురువు స్వామి దయానంద గిరి కన్నుమూత
రిషికేశ్: ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్యాత్మిక గురువు స్వామి దయానంద్ గిరి(87) శివైక్యం పొందారు. రిషికేశ్‌లోని దయానంద్ ఆశ్రమంలో బుధవారం రాత్రి 10.20గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు.
గత పదిరోజులుగా జాలీగ్రాంట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న స్వామి దయానంద్ గిరి ఆరోగ్యం విషమించడంతో ఆస్పత్రి నుంచి ఆశ్రమానికి బుధవారమే తరలించారు.
బుధవారం రాత్రి సమయంలో తీవ్ర అస్వస్థతకు గురైన స్వామి దయానంద గిరి ఆశ్రమంలోనే కన్నుమూశారు. సెప్టెంబర్ 25న స్వామి దయానంద గిరి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

ప్రధాని మోడీ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉండటంతో.. స్వామి దయానంద గిరి అంత్యక్రియల్లో పాల్గొనే అవకాశం లేకుండా పోయింది. సెప్టెంబర్ 11న చివరి సారిగా మోడీ, స్వామి దయానంద్ గిరిని కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆడిగి తెలుసుకున్నారు.
Swami Dayananda Saraswati ji's demise is a personal loss. I pray that his soul attains eternal peace.
— Narendra Modi (@narendramodi) September 24, 2015 కాగా, గురువు తుదిశ్వాస విడిచిన విషయాన్ని తెలుసుకున్న మోడీ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆయన లేకపోవడం తనకు వ్యక్తిగతంగా తీరని లోటని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆయన ఆలోచనలు అనేకమంది ప్రజల్లో స్ఫూర్తి నింపాయని అన్నారు.












Click it and Unblock the Notifications