వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్టికల్ 370 రద్దుతో క్షేత్రస్థాయికి ప్రజాస్వామ్యం - అభివృద్ధి కొత్త పుంతలు : ప్రధాని మోదీ..!!

|
Google Oneindia TeluguNews

జమ్ముకశ్మీర్​ను త్వరితగతిన అభివృద్ధి పరిచేందుకు పనులు శరవేగంగా జరుగుతున్నాయని ప్రధాని మోదీ చెప్పారు. ఆర్టికల్ 370 రద్దుతో జమ్ముకశ్మీర్​లో ప్రజాస్వామ్యం క్షేత్రస్థాయికి చేరిందని చెప్పారు. 2019లో ఆర్టికల్ 370 రద్దు చేసిన అనంతరం ఆదివారం తొలిసారి జమ్ము - కాశ్మీర్ లో ప్రధాని పర్యటిస్తున్నారు. ఈ అధికరణ రద్దుతో స్థానిక యువతకు పెద్దఎత్తున ఉద్యోగాలు లభిస్తాయని పేర్కొన్నారు.జమ్ముకశ్మీర్​లో అభివృద్ధికి ఊతమిచ్చేందుకు పనులు శరవేగంగా జరుగుతున్నాయని వివరించారు.

20 వేల కోట్ల పనులు ప్రారంభం

20 వేల కోట్ల పనులు ప్రారంభం

రూ.3,100 కోట్లతో నిర్మించిన బనిహాల్‌-కాజీగుండ్‌ సొరంగ మార్గాన్ని మోదీ జాతికి అంకితం చేశారు. 108 జన ఔషధీ కేంద్రాలను, సౌర విద్యుత్‌ కేంద్రాన్ని ప్రారంభించారు. రూ. 7,500 కోట్ల రూపాయలతో నిర్మించనున్న దిల్లీ-అమృత్‌సర్‌-కాట్రా ఎక్స్‌ప్రెస్‌ రహదారి, చీనాబ్‌ నదిపై నిర్మించనున్న రెండు జల విద్యుత్‌ ప్రాజక్టులకు కూడా శంకుస్థాపన చేశారు. భారత కళలు, సాంస్కృతిక వారసత్వ సంస్థ ఇన్‌టాక్‌ ఏర్పాటు చేసిన ప్రదర్శన శాలను సందర్శించారు. ఈ సందర్భంగా రూ.20వేల కోట్ల విలువైన విద్యుత్ కు సంబంధించి అనుసంధానం -అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.

ఆర్టికల్ 370 రద్దుతో అనూహ్య మార్పులు

ఆర్టికల్ 370 రద్దుతో అనూహ్య మార్పులు

పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశంలోని పంచాయతీలను ఉద్దేశించి సాంబా జిల్లాలోని పల్లీ గ్రామంలో ప్రసంగించారు. పంచాయతీ రాజ్ వ్యవస్థ.. ప్రజాస్వామ్య స్ఫూర్తిని బలోపేతం చేస్తుందని మోదీ చెప్పుకొచ్చారు. జమ్ము కాశ్మీర్ నుంచి దేశ వ్యాప్తంగా ఉ్న పంచాయితీలతో సమావేశం నిర్వహించటం గర్వంగా ఉందని చెప్పారు. ప్రజాస్వామ్యం అమలు, అభివృద్ధి పనులను చేపట్టడంలో ఈ ప్రదేశం కొత్త ఉదాహరణగా నిలిచిందని ప్రధాని వ్యాఖ్యానించారు.

ఉపాధి - అభివృద్ధి

ఉపాధి - అభివృద్ధి

సుదీర్ఘ కాలంగా రిజర్వేషన్ ప్రతిఫలాలు జమ్ముకశ్మీర్​ ప్రజలు అందుకోలేకపోయారని.. 370వ అధికరణ రద్దు అనంతరం దాని ప్రయోజనం పొందుతున్నారని వివరించారు. అభివృద్ధి లో ప్రజలు భాగస్వాములు అవుతున్నారని చెప్పుకొచ్చారు. ఏక్‌ భారత్‌-శ్రేష్ఠ భారత్‌ గురించి మాట్లాడితే మా దృష్టి అనుసంధానతపైనా, దూరాలను తగ్గించడంపైనా ఉంటుందని చెప్పుకొచ్చారు. అన్నింటి మధ్య దూరాలు తగ్గించటమే తమ ప్రాధమిక అంశమని ప్రధాని స్పష్టం చేసారు. ప్రధాని పర్యటనకు ముందు చోటు చేసుకున్న పరిణామాలతో పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు.

English summary
PM Modi that development and democracy are flourishing in the Union Territory after the Constitutional reforms.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X