PM MODI: భవిష్యత్తుకు రోడ్‌మ్యాప్, చరిత్రాత్మకం..!!
కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ ను ప్రధాని మోదీ ప్రశంసించారు. 202-27 వార్షిక బడ్జెట్ ను ఆర్దిక మంత్రి పార్లమెంట్ లో ప్రవేశ పెట్టారు. రూ.53.47 లక్షల కోట్ల పరిమాణంతో ప్రవేశ పెట్టిన ఈ బడ్జెట్ వికసిత్ భారత్‌లో భాగంగా యువత ఆకాంక్షలకు అద్దం పట్టేలా తీసుకొచ్చినట్లు చెప్పుకొచ్చారు. పేదలు, బలహీన వర్గాలు, దళితులు, ఆదివాసీల కోసం కేంద్రం చర్యలు తీసుకుంటుందన్నారు. కాగా, ఈ బడ్జెట పైన ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేసారు.
కేంద్ర బడ్జెట్ పైన స్పందించిన ప్రధాని మోదీ.. 2047 విజన్ లక్ష్యాలకు అనుగుణంగా ఉందని ప్రశంసించారు. భవిష్యత్తుకు రోడ్‌మ్యాప్‌గా నిలుస్తుందని చెప్పారు. త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. చరిత్రాత్మక బడ్జెట్ ప్రవేశపెట్టామని చెప్పారు. అటు బడ్జెట్ ప్రతిపాదనలు... కేటాయింపుల పైన కాంగ్రెస్ చీఫ్ ఖర్గే విమర్శలు చేసారు. ఇటు బీజేపీ తో పాటుగా ఎన్డీఏ పక్షాల నేతలు బడ్జెట్ ను అభినందిస్తున్నారు. కాగా, ప్రధాని మోదీ ఈ బడ్జెట్ ద్వారా తమ లక్ష్యాలకు అనుగుణంగా ముందుకు వెళ్తున్నట్లు వివరించారు. బడ్జెట్‌లో ఆత్మనిర్భర్ భారత్‌కు కేటాయింపులు చేశామన్నారు. కేంద్ర బడ్జెట్ ద్రవ్యలోటును నియంత్రణ కు సహకరిస్తుందని చెప్పారు. మౌలిక వసతుల కల్పనకు బడ్జెట్‌లో మరింత ఊతమిచ్చామని ప్రధాని వివరించారు.

విజన్ 2047 లక్ష్యంగా
కాగా, ఈ బడ్జెట్ లో భారత్ భవిష్యత్ లక్ష్యాలను స్పష్టం చేసామని.. ఆ దిశగా సాగుతున్న ప్రయాణం కోసం తీసుకున్న నిర్ణయంగా వివరించారు. లోకల్ నుంచి గ్లోబల్ స్థాయికి భారత్ ఎదిగిందని చెప్పిన ప్రధాని.. యువశక్తిని ప్రోత్సహించే విధంగా బడ్జెట్ ఉందని కితాబిచ్చారు. అదే విధంగా ఈ బడ్జెట్ లో యువతకు గేమింగ్, టూరిజం, క్రీడా సౌకర్యాలు. వికసిత్ భారత్ ప్రయాణం వేగవంతా నికి తోడ్పాటు ఇస్తుందన్నారు.
సంస్కరణలకు బడ్జెట్ నూతన ఉత్తేజాన్ని ఇస్తుందని పేర్కొన్నారు. భారత్‌ను డేటా సెంటర్‌గా మార్చేందుకు ట్యాక్స్ హాలుడే ప్రకటించారని... ఇది భారత్‌ను డేటా సెంటర్ హబ్‌గా మారుస్తుందని చెప్పారు. ఉద్యోగాల కల్పనకు కేంద్ర బడ్జెట్ మరింత దోహదం చేస్తుందని వివరించారు. కేంద్ర బడ్జెట్ నారీ శక్తిని ప్రతిబింబిస్తుందని.. ఈ బడ్జెట్‌లో ఈశాన్య ప్రాంతాల పర్యాటకంపై దృష్టి పెట్టినట్లు ప్రధాని పేర్కొన్నారు.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..!












Click it and Unblock the Notifications