కోవిడ్ బాధిత చిన్నారుల కోసం - అండగా పీఎం కేర్స్ : సాయం ఇలా - ప్రధాని మోదీ..!!
కొవిడ్ కారణంగా అనాథలైన పిల్లలకు అండగా నిలుస్తామని ప్రధాని మోదీ భరోసా ఇచ్చారు. పీఎం కేర్స్ ఫల్ చిల్డ్రన్ ద్వారా సాయం అందించే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు ఈ పధకం ఎంత గానో ఎపయోగపడుతుందని ప్రధాని పేర్కొన్నారు. దేశం మొత్తం వారికి అండగా ఉందనే భరోసా వారిలో కల్పిస్తుందనే అశాభావం వ్యక్తం చేసారు. కొవిడ్ సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన వారి పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో తనకు తెలుసునని.. వారి కోసమే ఈ కార్యక్రమాన్ని చేపట్టామని ప్రధాని చెప్పారు.
అనాథలైన చిన్నారులు పాఠశాల విద్యను పూర్తి చేసుకున్న తర్వాత ఎక్కువ డబ్బు అవసరమవుతుందని ప్రధాని అభిప్రాయపడ్డారు. అలాంటి వారికి రోజువారీ ఖర్చుల కోసం ఇతర పథకాల ద్వారా నెలకు రూ.4వేలు అందిస్తున్నామని వివరించారు. 18-23 ఏళ్ల వారికి ప్రతినెల స్టైఫండ్ అందుతుందన్నారు. 23 ఏళ్ల వయసుకు చేరుకున్న తర్వాత రూ.10 లక్షలు వస్తాయని వివరించారు. పీఎం కేర్స్ ద్వారా ఆయుష్మాన్ హెల్త్ కార్డు అందిస్తామని వెల్లడించారు. దాని ద్వారా రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం అందుతుందని చెప్పారు. పథకంలో భాగంగా.. పిల్లలకు 18 ఏళ్లు నిండేసరికి వారి పేరిట రూ.10 లక్షల సొమ్ము ఉండేలా డిపాజిట్ చేస్తారు. 18 నుంచి 23 ఏళ్ల వయసు వరకు ఆ డిపాజిట్‌పై వడ్డీని వారికి ఆర్థిక సాయంగా అందిస్తారు.

23 ఏళ్లు నిండిన తర్వాత పూర్తిగా రూ.10 లక్షలు లబ్ధిదారులకు ఇచ్చేస్తారు. 2020 మార్చి 11 నుంచి 2022 ఫిబ్రవరి 28 మధ్యలో తల్లిదండ్రులు, చట్టబద్ధమైన సంరక్షకులు, దత్తత తల్లిదండ్రులు లేదా ఏకైక ఆధారంగా ఉన్న తల్లినో, తండ్రినో కోల్పోయిన పిల్లలకు ఉపకారవేతనాలు, పీఎం కేర్స్ పాస్ పుస్తకాలు, ఆయుష్మాన్ భారత్ వైద్య బీమా కార్డును అందించనున్నారు. అర్హులైన పిల్లలు తమ పేర్లు నమోదు చేసుకునేందుకు పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పేరుతో ఒక పోర్టల్ ప్రారంభించారు. పేర్ల నమోదు దగ్గర నుంచి దరఖాస్తుల ఆమోద ప్రక్రియ, సాయం అందించటం వరకు అన్నీ ఈ పోర్టల్ ద్వారా నిర్వహించనున్నారు.












Click it and Unblock the Notifications