'ఒక చాయ్‌ వాలా.. మరో చాయ్‌ వాలాతో'.. వీడియో వైరల్

ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం యూకే పర్యటనలో ఉన్నారు. పర్యటనలో భాగంగా భారత్ కు చెందిన యువ పారిశ్రామికవేత్త అఖిల్ పటేల్ స్వయంగా తయారుచేసిన టీ ను ఆస్వాదించారు. ఆయనతోపాటు.. బ్రిటన్‌ ప్రధాని కీవ్‌ స్టార్మర్‌ కూడా టీ ను సేవించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ప్రధాని మోదీ తన ఎక్స్‌ ఖాతాలో పోస్టు చేశారు. చెకర్స్‌ లో మోదీ, కీవ్‌ స్టార్మర్‌ తో చాయ్‌ పే చర్చా.. భారత్‌- యూకే సంబంధాలు బలంగా ఉన్నాయి అని క్యాప్షన్ ఇచ్చారు. అందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం యూకే పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. అయితే అక్కడ తాజాగా ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. బ్రిటన్ ప్రధాని కీవ్ స్టార్మర్‌ తో కలిసి చెకర్స్‌ లో విరామ సమయంలో మోదీ చాయ్‌ ను ఆస్వాదించారు. అయితే ఆ చాయ్ ను భారత సంతతికి చెందిన యువ పారిశ్రామికవేత్త అఖిల్ పటేల్ స్వయంగా తయారుచేశారు. ఇరు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేశాక ఇరు దేశాల అధినేతలు ఇలా చాయ్ ఆస్వాదించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

భారత్​, యుకే మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్​టీఏ) ఎంతో చారిత్రాత్మకమైనదిగా ఇరు దేశాలు భావిస్తున్నాయి. ఇరుదేశాలకు ప్రయోజనకరమైన ఈ వాణిజ్య ఒప్పందంపై గురువారం సంతకాలు చేశారు. ఈ డీల్ వల్ల భారత్ నుంచి యూకేకు జరిగే దాదాపు 99 శాతం ఎగుమతులపై సుంకాలను తొలగించడం లేదా తగ్గించడం జరుగుతుంది. దీని వల్ల భారత్​ కు అధిక ప్రయోజనం చేకూరనుంది. వీటిల్లో వస్త్రాలు, తోలు, పాదరక్షలు, క్రీడా వస్తువులు, బొమ్మలు, సముద్ర ఉత్పత్తులు, రత్నాలు, ఆభరణాలు, ఇంజినీరింగ్ వస్తువులు, ఆటో విడిభాగాలు, ఇంజిన్లు, సేంద్రీయ రసాయనాలు వంటి రంగాలకు ప్రయోజనం ఉండనుంది.

PM Modi Sips Tea by Indian Entrepreneur Akhil Patel During UK Visit

ఇక అంతేకాక ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం భారతదేశ మత్స్య రంగానికి ముఖ్యంగా ఏపీ, ఒడిశా, కేరళ, తమిళనాడు లాంటి తీరప్రాంత రాష్ట్రాలకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. యూకేలో ప్రస్తుతం 4.2 శాతం నుంచి 8.5 శాతం వరకు రొయ్యలు, టూనా చేపలు, మాంసంపై సుంకాలు ఉన్నాయి. ఈ ట్రేడ్ డీల్ తర్వాత ఈ ఉత్పత్తులు ఎలాంటి సుంకం లేకుండా యూకే మార్కెట్‌ లోకి వెళ్తాయి. అలాగే యూకే నుంచి దిగుమతి చేసుకునే కార్లు, విస్కీ, వైద్య పరికరాలు భారతదేశానికి చౌక ధరలకు దొరుకుతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+