నా ఫ్రెండ్ ట్రంప్ ను కలిసేందుకు వెళ్తున్నా-మోడీ ఎమోషనల్..!

భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ ఫ్రాన్స్, అమెరికా పర్యటనలకు బయలుదేరి వెళ్లారు. ముందుగా ఆయన ఫ్రాన్స్ రాజధాని పారిస్ చేసుకుని అక్కడ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మ్యాక్రాన్ తో భేటీ కానున్నారు. అనంతరం ఏఐ సదస్సులో పాల్గొంటారు. అక్కడి నుంచి అమెరికా వెళ్లి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో భేటీ కానున్నారు. వరుసగా మూడోసారి ప్రధాని అయ్యాక ప్రధాని మోడీ.. తొలిసారి అమెరికా, ఫ్రాన్స్ పర్యటనలకు వెళ్తున్నారు.

ఈ నేపథ్యంలో తాను ఫ్రాన్స్, అమెరికా పర్యటనలకు వెళ్తున్నట్లు ప్రధాని మోడీ ఇవాళ ట్వీట్ చేశారు. ఇందులో ఆయన ముందుగా ఫ్రాన్స్ పర్యటన వివరాలను వెల్లడించారు. ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా తాను అక్కడి అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మ్యాక్రాన్ తో భేటీ అవుతానని, ఇందులో భారత్-ఫ్రాన్స్ సంబంధాల బలోపేతంపై చర్చిస్తానని తెలిపారు. ఆ తర్వాత ఉమ్మడిగా ఆతిధ్యమిస్తున్న ఏఐ సదస్సులో కూడా పాల్గొంటానని ట్రంప్ ట్వీట్ చేశారు. అనంతరం మార్సిలీ వెళ్లి అక్కడ భారత రాయబార కార్యాలయం ప్రారంభిస్తానని మోడీ తెలిపారు.

pm modi started for France US tours says to meet friend donald trump

అనంతరం అమెరికా పర్యటన వివరాలను కూడా వెల్లడించారు. ఇందులో వాషింగ్టన్ డీసీలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో భేటీ అయ్యేందుకు ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ఈ భేటీలో ఇరుదేశాల బంధాన్ని బలోపేతం చేయడంతో పాటు వివిధ రంగాల్లో సంబంధాలను బలోపేతం చేస్తానని వెల్లడించారు. గతంలో ట్రంప్ తొలిసారి అధ్యక్షుడిగా పనిచేసినప్పుడు తాను ఆయనతో కలిసి పనిచేశానని, అప్పట్లో చర్చించిన పలు విషయాల ఆధారంగా ప్రస్తుతం చర్చల్ని ముందుకు తీసుకెళ్తానని వెల్లడించారు.
అసలే భారత్-అమెరికా మధ్య వలసల విషయంలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో మోడీ యూఎస్ టూర్ ప్రాధాన్యం సంతరించుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+