వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీ, జేడీఎస్ దోస్తీ, సిద్దరామయ్య లాంటి వాళ్లు, క్లారిటీ ఇచ్చిన హెచ్ డీ దేవేగౌడ, మోడీ మాట !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటక శాసన సభ ఎన్నికల సందర్బంగా ప్రచారం చెయ్యడానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు దేశవ్యాప్తంగా జోరుగా చర్చ జరుగుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలపై మాజీ ప్రధాని, జేడీఎస్ పార్టీ చీఫ్ హెచ్.డి. దేవేగౌడ క్లారిటీ ఇచ్చారు.

నరేంద్ర మోడీ దెబ్బ

నరేంద్ర మోడీ దెబ్బ

దేశ మాజీ ప్రధాని హెచ్ డీ. దేవేగౌడను కాంగ్రెస్ నాయకులు అవమానించారని నరేంద్ర మోడీ ఆరోపించారు. ప్రధానిగా హెచ్ డి. దేవేగౌడ ప్రజల కోసం చేసిన సేవను దేశం ఎప్పటికీ మరిచిపోదని, ఇంకా ఆయన ప్రజలకు సేవ చెయ్యాలని, ఆయన తన హృదయంలో ఉన్నారని ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ ర్యాలీలో అన్నారు.

కాంగ్రెస్ విమర్శలు

కాంగ్రెస్ విమర్శలు

హెచ్.డి. దేవేగౌడ మీ హృదయంలో ఉంటే మీ రాజకీయ గురువు ఎల్ కే. అడ్వాణి ఎక్కడున్నారని కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత జైవీర్ శ్రీగిల్ ప్రధాని మోడీని ప్రశ్నించారు. మొదట మీ రాజకీయ గురువు ఎల్ కే. అడ్వాణికి విలువ ఇవ్వాలని, కర్ణాటకకు వచ్చి ఎన్నికల డ్రామాలు ఆడకూడదని ప్రధాని నరేంద్ర మోడీని జైవీర్ శ్రీగ్రిల్ విమర్శించారు.

సిద్దరామయ్య లాంటి నేతలు

సిద్దరామయ్య లాంటి నేతలు

ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలపై బుధవారం బెంగళూరులో మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ స్పంధించారు. ఒక కన్నడిగ దేశ ప్రధాని అయ్యారని, సిద్దరామయ్య కన్నడిగుడు (దేవేగౌడ)ను అవమానిస్తున్నారని, అలాంటి కాంగ్రెస్ పార్టీ కన్నడిగులకు ఎలా గౌరవం ఇస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారని, అందులో వేరే అర్థం లేదని మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ వివరించారు.

ముందే వార్నింగ్

ముందే వార్నింగ్

మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ ఇటీవల తన కుమారుడు బీజేపీతో జతకడితే కుటుంబం నుంచి బహిష్కరిస్తానని హెచ్చరించిన విషయం తెలిసిందే. ప్రధాని మోడీ వ్యాఖ్యలతో బీజేపీ, జేడీఎస్ కుమ్మక్కు అయ్యాయని ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఆరోపణలను తిప్పికొట్టడానికి మాజీ ప్రధాని హెచ్ డీ. దేవేగౌడ వివరణ ఇచ్చారు.

English summary
A Kannadiga had become the PM. How Siddaramaiah tried to demolish the Kannadigas pride, taking that as a background, he (PM Modi) said this is how Congress gives respect to Kannadigas, this does not mean a 'gathbandhan', said JDS nation president HD Deve Gowda on Prime minister Modi's statement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X