భారత్ లో పట్టాలెక్కేది ఇట్లాంటి బుల్లెట్ రైలే
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం జపాన్ లో పర్యటిస్తోన్నారు. నేటితో ఆయన పర్యటన ముగుస్తుంది. అక్కడి నుంచి ఆయన నేరుగా చైనాకు బయలుదేరి వెళ్తారు. ఏడు సంవత్సరాల తర్వాత మోదీ చైనాలో అడుగు పెట్టబోతోండటం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా ఆ దేశాధ్యక్షుడు గ్ఝి జిన్ పింగ్ తో ముఖాముఖి సమావేశం కానున్నారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సభ్య దేశాల సమావేశానికీ హాజరవుతారు.
జపాన్ పర్యటనలో భాగంగా అక్కడి బుల్లెట్ రైల్ ప్రాజెక్ట్ ను పరిశీలించారు ప్రధాని మోదీ. తన కౌంటర్ పార్ట్ షిగేరు ఇషిబాతో కలిసి బుల్లెట్ రైలులో ప్రయాణించారు కూడా. కొత్తగా పట్టాలెక్కిన ALFA-X train ఇది. రాజధాని టోక్యో నుంచి సెండాయ్ మధ్య రాకపోకలు సాగించడానికి జపాన్ ప్రభుత్వం దీన్ని నడిపిస్తోంది.

ఇందులో టోక్యో నుంచి సెండాయ్ వరకు బుల్లెట్ రైలులో ప్రయాణించారు మోదీ. దీని పనితీరు, గరిష్ఠ వేగం, మెయింటెనెన్స్, నిర్వహణకు అయ్యే ఖర్చు.. వంటి అంశాలపై ఆరా తీశారు. భారత్ లో అహ్మదాబాద్- ముంబై మధ్య ప్రవేశపెట్టదలిచిన బుల్లెట్ రైల్ ప్రాజెక్టు గురించి ఆయనకు వివరించారు.
దీనికి సంబంధించిన వివరాలను షిగేరు ఇషిబా తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. కొన్ని ఫొటోలను దీనికి జత చేశారు. మోదీతో కలిసి సెండాయ్‌కి వెళ్తున్నాను. నిన్నటి నుంచి ఆయనతో పాటు కారులో ప్రయాణిస్తున్నాను. ఇప్పుడు కొత్త అల్ఫా- ఎక్స్ బుల్లెట్ రైలు అని పేర్కొన్నారు.
仙台に到着いたしました。石破首相とともに新幹線でこの地を訪れました。@shigeruishiba pic.twitter.com/fJ4yr5gtKh
— Narendra Modi (@narendramodi) August 30, 2025
సెండాయ్ చేరుకున్న తర్వాత మోదీ.. జపాన్ రైల్వేస్‌లో శిక్షణ పొందుతున్న భారతీయ లోకో పైలట్లను కలిశారు. వారితో కొద్దిసేపు మాట్లాడారు. శిక్షణకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ లోకో పైలెట్లను అహ్మదాబాద్- ముంబై మధ్య నడిపించదలిచిన బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ లో అపాయింట్ చేయనుంది కేంద్రం.
అంతకుముందు రోజు- టోక్యోలో 16 జపాన్ ప్రిఫెక్చర్ల గవర్నర్‌లతో ప్రధాని మోదీ సమావేశం అయ్యారు. భారత్-జపాన్ మైత్రీ బంధం గురించి మాట్లాడారు. ఈ రెండు దేశాల మధ్య కొనసాగుతోన్న వ్యూహాత్మక, గ్లోబల్ పార్ట్ నర్ షిప్ అంశాన్ని ప్రస్తావించారు. భారత ప్రయోజనాల కోసం ప్రిఫెక్చర్ సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..!












Click it and Unblock the Notifications