Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కాంగ్రెస్ సహా విపక్షాలపై ప్రధాని విసుర్లు-రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు-ఎన్డీయేకు కితాబు

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి లోక్ సభలో ప్రధాని మోడీ ఇవాళ సమాధానం ఇచ్చారు. ఇందులో ఆయన ఓవైపు కేంద్ర ప్రభుత్వ విధానాలకు కితాబు ఇస్తూనే మరోవైపు విపక్షాలను లక్ష్యంగా చేసుకున్నారు. విపక్షాలపై విమర్శలు మొదలుపెట్టడంతో ప్రధాని ప్రసంగానికి విపక్షాలు అడ్డుతగిలాయి. దీంతో ప్రధాని మరింత రెచ్చిపోయారు. ఇలాగేతే వందేళ్లైనా కాంగ్రెస్ అధికారంలోకి రాలేదంటూ మోడీ చురకలు అంటించారు.

లతామంగేష్కర్ కు ప్రధాని నివాళి

లతామంగేష్కర్ కు ప్రధాని నివాళి

రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు ప్రధాని మోడీ ఇవాళ లోక్ సభలో సమాధానం ఇచ్చారు. లోక్‌సభలో ప్రసంగం ప్రారంభించడానికి ముంందు ప్రధాని మోదీ నిన్న మృతిచెందిన దిగ్గజ గాయని లతా మంగేష్కర్ కు నివాళులు అర్పించారు. ఆమె సంగీతం ద్వారా మన దేశాన్ని ఏకం చేసిందని మోడీ గుర్తుచేశారు. అంతకు ముందు లతా మంగేష్కర్ మృతికి సంతాపంగా లోక్ సభ, రాజ్యసభ గంటసేపు వాయిదా పడ్డాయి. అనంతరం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చకు ప్రధాని సమాధానం ఇచ్చారు.

 ఎన్డీయే పాలనకు మోడీ కితాబు

ఎన్డీయే పాలనకు మోడీ కితాబు

ఇందులో రాబోయే సంవత్సరాల్లో భారతదేశం ప్రపంచ నాయకత్వ పాత్రను ఎలా పోషించగలదో ఆలోచించడానికి 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' సరైన సమయమని మోడీ తెలిపారు. గత కొన్నేళ్లుగా భారతదేశం అనేక అభివృద్ధి పురోగతులను సాధించిందనేది అంతే నిజమన్నారు. గత కొన్నేళ్లుగా మన దేశం ప్రాథమిక సౌకర్యాలకు సంబంధించిన అనేక రంగాలలో అభివృద్ధి చెందిందని మోడీ తెలిపారు. ఈ కార్యక్రమాలు ఇంతకు ముందు ఉన్నాయని, కానీ ఇప్పుడు పథకాలు అమలవుతున్న వేగం ప్రధానమని మోదీ చెప్పారు. ఇప్పుడు మరుగుదొడ్లు ఉన్నాయని గ్రామస్తులు గర్వపడుతున్నారని తెలిపారు. ఎవరు సంతోషంగా లేరని ప్రశ్నించారు.

 కాంగ్రెస్ నిరసనతో మోడీ ఎదురుదాడి

కాంగ్రెస్ నిరసనతో మోడీ ఎదురుదాడి

ప్రధాని మోదీ గత ప్రభుత్వ పథకాలను వివరిస్తుండగా, ప్రతిపక్ష నేత అధీర్ రంజన్ చౌదరి లేచి నిరసన తెలిపారు. దీంతో విపక్షాలపై ప్రధాని మోదీ ఎదురుదాడికి దిగారు. ఇంకా కొంతమంది 2014లోనే ఇరుక్కుపోయారని చెప్పారు. 2014లో ప్రతిపక్షాల సూది ఎక్కడో తగులుకుని ఇరుక్కుపోయిందని, మీరు దీని నుంచి బయటపడాలని సూచించారు. ప్రజలకు అన్నీ తెలుసని, వారు గుర్తించారని మోడీ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్లు దేశాన్ని పాలించిందని, పార్లమెంటు దేశం కోసం పనిచేసేందుకే ఉందని, కానీ విపక్ష కాంగ్రెస్ మాత్రం రాజకీయాలకు దీన్ని వాడుకుంటోందని మోడీ చురకలు అంటించారు. అయితే మీకు సమాధానం చెప్పేందుకు తాము సిద్ధంగా ఉంటామని మోడీ తెలిపారు. ఇది ఎన్నికల ఫలితాల గురించి కాదని, చాలా ఎన్నికల్లో మీరు ఓడిపోయినప్పటికీ మీ అహంకారం పోలేదని, మీ ఆవరణ వ్యవస్థ మీ అహంకారాన్ని వీడదని మోడీ విమర్శలు గుప్పించారు.

కరోనా వ్యాప్తికి కాంగ్రెస్, ఆప్ కారణం

కరోనా వైరస్ మోడీ ఇమేజ్ ను దెబ్బతీస్తుందని కొందరు ఎదురుచూశారని, అందులో భాగంగానే ఢిల్లీ, ముంబై నుంచి వలసకూలీల్ని తరిమేసి కరోనా వ్యాప్తికి కారణమయ్యారని ప్రధాని ఆరోపించారు. కరోనా మొదటి వేవ్ సమయంలో, ప్రజలు లాక్‌డౌన్‌లో ఉన్నప్పుడు, ప్రజలు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండాలని మార్గదర్శకాలు సూచిస్తున్నాయని, కానీ కాంగ్రెస్ ముంబై స్టేషన్‌లో నిలబడి అమాయక ప్రజలను భయపెట్టిందని మోడీ గుర్తుచేశారు. ఢిల్లీ నుంచి అక్కడి ప్రభుత్వం వలసకూలీల్ని వెళ్లగొట్టి కరోనా వ్యాప్తికి కారణమైందన్నారు. కోవిడ్ మహమ్మారి వెలుగుచూశాక ప్రపంచ పరిణామం మారిందని, ఇందులో భారత్ నాయకత్వం వహిస్తూ గుర్తింపు తెచ్చుకుంటోందని మోడీ గుర్తుచేశారు. ప్రపంచ నాయకత్వ పాత్రను భారతదేశం తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

కాంగ్రెస్ వందేళ్లకూ అధికారంలోకి రాదన్న మోడీ

విమర్శలు అవసరమే కానీ ప్రతిదానిపై గుడ్డి వ్యతిరేకత ఎప్పుడూ ముందుకు ఫలితం ఇవ్వదని ప్రధాని మోడీ తెలిపారు. ప్రజాస్వామ్యంపై తమకు గట్టి నమ్మకం ఉందన్నారు విమర్శ అనేది ప్రజాస్వామ్యంలో ముఖ్యమైన భాగమని కూడా తామూ నమ్ముతున్నామమని, కానీ, ప్రతిదానికీ గుడ్డి వ్యతిరేకత ఎప్పుడూ పనిచేయదని గుర్తుచేశారు. కోవిడ్ సమయంలో కాంగ్రెస్ అన్ని పరిమితులను దాటిందని ప్రధాని మోడీ మండిపడ్డారు. తాము మహాత్మాగాంధీ ఆశయాల్లో భాగమైన యోగా, ఫిట్ ఇండియా, స్వదేశీ నినాదాలు తెస్తుంటే అందులో కాంగ్రెస్ ఎందుకు భాగస్వామి కాలేకపోతోందని మోడీ ప్రశ్నించారు.
కాంగ్రెస్ ఇదే వైఖరితో ఉంటే మరో వందేళ్ల వరకూ అధికారంలోకి రాలేదని మోడీ హెచ్చరించారు. 75 ఏళ్లు దాటినా కొందరు బానిస మనస్తత్వాల నుంచి బయటపడలేకపోతున్నారని కాంగ్రెస్ ను విమర్శించారు.

దటీజ్ మోడీ సర్కార్

ప్రభుత్వాలతోనే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని తామూ భావించడం లేదని మోడీ తెలిపారు. దానికి బదులుగా యువశక్తిపై నమ్మకం ఉంచామన్నారు. దేశవ్యాప్తంగా ఏర్పాటైన 7 వేల స్టార్టప్ సంస్ధలే ఇందుకు నిదర్శనమన్నారు. పీఎం గతిశక్తి ద్వారా మౌలిక సౌకర్యాల రంగంలో సవాళ్లను అధిగమిస్తున్నట్లు మోడీ తెలిపారు. మేకిన్ ఇండియా గురించి మాట్లాడుతుంటే విపక్షాలకు బాధ కలుగుతోందని, కానీ వారి కమిషన్లకు, అవినీతికి దీంతో అడ్డుకట్ట పడిందన్నారు. గతంలో యూపీఏ సర్కార్ హయాంలో ద్రవ్యోల్బణంతో పోలిస్తే ఇప్పుడు పరిస్ధితి అంత దారుణంగా ఏమీ లేదని మోడీ తెలిపారు. దేశ తొలి ప్రధాని నెహ్రూ కూడా విదేశాల్లో పరిస్ధితుల ప్రభావం మన దేశంలో ధరలపై ఉంటుందని చెప్పిన విషయాన్ని మోడీ గుర్తుచేశారు.

కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు

ప్రధాని తన ప్రసంగంలో అత్యధిక భాగం కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ, చిదంబరంతో పాటు భారత తొలి ప్రధాని నెహ్రూను సైతం విమర్శించారు. కాంగ్రెస్ ఇప్పుడు తుక్ డే తుక్ డే గ్యాంగ్ కు లీడర్ అంటూ ప్రధాని తీవ్ర విమర్శలకు దిగారు. రాహుల్ గాంధీ యూనియన్ ఆఫ్ స్టేట్స్ విమర్శలకు సమాధానంగా కాంగ్రెస్ పార్టీ బ్రిటీష్ విధానమైన విభజించు-పాలించు నినాదాన్ని నమ్ముకుందని మోడీ విమర్శించారు. సభలో తమిళ సెంటిమెంట్లను సైతం రెచ్చగొట్టి లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తోందని మోడీ ఆరోపించారు. మోడీ ప్రసంగం ఆద్యంతం విపక్ష కాంగ్రెస్ ఎంపీలు నిరసనగా నినాదాలు చేస్తూనే ఉన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+