వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేషనల్ డాక్టర్స్ డే: వైద్యులనుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని నరేంద్ర మోడీ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కరోనా కష్ట కాలంలో వైద్యులు, వైద్య సిబ్బంది వెలకట్టలేని సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జులై 1న జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా గురువారం ప్రధాని నరేంద్ర మోడీ వైద్యులను ఉద్దేశించి కీలక ప్రసంగం చేయనున్నారు.

భారత వైద్యుల సంఘ:(ఐఎంఏ) నిర్వహిస్తోన్న ఈ కార్యక్రమంలో గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు ప్రధాని మోడీ మాట్లాడనున్నారు. ప్రముఖ వైద్య నిపుణుడు, పశ్చిమబెంగాల్ మాజీ సీఎం, దివంగత బిదాన్ చంద్రరాయ్ గౌరవార్థం జులై 1వ తేదీన వైద్యుల దినోత్సవంగా జరుపుకుంటారు. కాగా, తన ప్రసంగం గురించి ప్రధాని మోడీ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

PM Modi to address medical community on National Doctors Day

కరోనావైరస్ కట్టడిలో వైద్యుల కృషి పట్ల భారత్ గర్వంగా ఉంది. వారి సేవలకు గుర్తుగా జులై 1వ తేదీన వైద్యుల దినోత్సవంగా జరుపుకుంటున్నామని ప్రధాని మోడీ తెలిపారు. ఐఎంఏ నిర్వహిస్తోన్న ఈ కార్యక్రమంలో గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు వైద్యులు, వైద్య సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడతానని చెప్పారు.

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నా వైద్యులు, వైద్య సిబ్బంది ప్రజలను రక్షించడంలో అలుపెరుగని సేవ చేస్తున్నారని ప్రధాని మోడీ గుర్తు చేశారు. కాగా, కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి కారణంగా దేశం సుమారు 800 మంది మంచి ఉద్యోగులు ఉన్నారు. మొదటి వేవ్ లోనూ వందలాది మంది తమ ప్రాణాలను పోగొట్టుకుని ప్రజలను కాపాడే ప్రయత్నం చేశారు.

English summary
PM Modi to address medical community on National Doctors Day
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X