బెంగళూరుకు మరో వందే భారత్: రూట్ ఇదే..!!
దేశంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల దూకుడు కొనసాగుతోంది. సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ సెమీ హైస్పీడ్ రైళ్ల సర్వీసులను కేంద్ర ప్రభుత్వం ప్రయాణికులకు మరింత చేరువ చేస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు పలు రైళ్లు పట్టాలెక్కాయి. వేర్వేరు రాష్ట్రాలు/నగరాల మధ్య పరుగులు పెడుతున్నాయి.
సాధారణ రైళ్లల్లో ఇప్పటివరకు లేని కొన్ని ప్రత్యేకతలు, వేగం.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఉండటం వల్ల వాటికి డిమాండ్ పెరుగుతోంది. ఆక్యుపెన్సీ రేషియో భారీగా ఉంటోంది. సాధారణ రైళ్లతో పోల్చుకుంటే టికెట్ ధర అధికమే అయినప్పటికీ- త్వరితగతిన గమ్యస్థానాలకు చేరడానికి వందే భారత్‌ను ఆశ్రయిస్తోన్నారు ప్రయాణికులు.

ఈ క్రమంలో మరో మూడు కొత్త వందే భారత్ ఎక్స్ ప్రెస్ లు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. ఈ నెల 10వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఈ మూడింటినీ పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. కర్ణాటకలోని బెళగావిలో ఆయన పర్యటించనున్నారు.
- బెళగావి- బెంగళూరు
- అజ్ని (నాగ్ పూర్)- పూణె
- అమృత్‌సర్-శ్రీ మాతా వైష్ణో దేవి కాట్రా
ఈ విషయాన్ని స్థానిక లోక్ సభ సభ్యుడు, కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. ఇప్పటికే కర్ణాటకలో 10 వందే భారత్ ఎక్స్ ప్రెస్ లు అందుబాటులో ఉన్నాయి. వివిధ మార్గాల్లో అవి పరుగులు తీస్తోన్నాయి. ఇది 11వ వందే భారత్ అవుతుంది.
ప్రతి రోజు తెల్లవారు జామున ఈ ఎక్స్ ప్రెస్.. బెళగావి నుంచి 5:20 నిమిషాలకు బయలుదేరి మధ్యాహ్నం 1:50 నిమిషాలకు బెంగళూరు చేరుకుంటుంది. తిరిగి బెంగళూరు నుంచి మధ్యాహ్నం 2:20 గంటలకు బయలుదేరి రాత్రి 10:40 గంటలకు బెళగావికి చేరుకుంటుంది. ధార్వాడ్, హుబ్బళ్లి, హావేరి, దావణగెరె, తుమకూరు స్టేషన్లల్లో ఈ రైలుకు హాల్ట్ సౌకర్యం ఉంది.
ಪ್ರಧಾನಿ ಶ್ರೀ @narendramodi ನರೇಂದ್ರ ಮೋದಿಯವರು ಇದೇ ಭಾನುವಾರ ಕರ್ನಾಟಕ ಪ್ರವಾಸದಂದು ಮೂರು ವಂದೇ ಭಾರತ್ ರೈಲಿಗೆ ಹಸಿರು ನಿಶಾನೆ ತೋರಲಿದ್ದಾರೆ. ಬೆಂಗಳೂರು - ಬೆಳಗಾವಿ, ನಾಗ್ಪುರದ ಅಜ್ನಿ- ಪೂಣಾ ಹಾಗೂ ಅಮೃತಸರ- ಶ್ರೀ ಮಾತಾ ವೈಷ್ಣವೊ ದೇವಿ ಕಟ್ರಾ ಮಧ್ಯೆ ನೂತನ ವಂದೇ ಭಾರತ್ ರೈಲು ಸಂಚರಿಸಲಿದೆ.
— Pralhad Joshi (@JoshiPralhad) August 5, 2025
ಈ ಹಿಂದೆ ನಾನು ಸಲ್ಲಿಸಿದ ಕೋರಿಕೆಯ…
కాగా.. శ్రీ మాతా వైష్ణో దేవి ఆలయాన్ని సందర్శించడానికి తరలి వెళ్లే భక్తుల కోసం రైల్ కనెక్టివిటీ మరింత పెరిగింది. ప్రస్తుతం శ్రీ మాతా వైష్ణో దేవి కాట్రా స్టేషన్ కు శ్రీనగర్ నుంచి రెండు వందే భారత్ ఎక్స్ ప్రెస్ లు అందుబాటులో ఉంటోన్నాయి. ఇప్పుడు తాజాగా అమృత్‌సర్ నుంచి మరో రైలును రాకపోకలు సాగించనుంది.












Click it and Unblock the Notifications