తల్లి కన్నుమూసిన బాధను దిగమింగుకుంటూ- దేశం కోసం మోదీ..!!

గాంధీనగర్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ అర్ధరాత్రి కన్నుమూశారు. ఆమె వయస్సు 100 సంవత్సరాలు. శ్వాస సంబంధిత ఇబ్బందులతో ఆమె ఇటీవలే అహ్మదాబాద్ లోని యూఎన్ మెహతా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్‌లో అడ్మిట్ అయ్యారు. చికిత్స తీసుకుంటోన్న సమయంలో ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికీ- ఆ తరువాత విషమించింది. డాక్టర్లు అత్యాధునిక వైద్య చికిత్సను అందించినప్పటికీ ఫలితం లేకపోయింది.

తల్లి మరణవార్త తెలిసిన వెంటనే మోదీ గాంధీనగర్ కు చేరుకున్నారు. ఆసుపత్రి నుంచి పార్థివ దేహాన్ని గాంధీనగర్ లోని రైసాన్ నివాసానికి తరలించారు. నివాళి అర్పించిన అనంతరం అంత్యక్రియలను చేపట్టారు. స్వయంగా తల్లి పాడెను మోశారు మోదీ. గాంధీనగర్ లోని శ్మశానవాటికలో చితికి నిప్పంటించారు. మోదీ సోదరుడు, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, మాజీ ముఖ్యమంత్రి విజయ్ రుపాణీ, కేబినెట్ మంత్రులు, అతి కొద్దిమంది సన్నిహితులు హీరాబెన్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

PM Modi to Flagging off of the Vande Bharat train in Howrah, Kolkata, and other development works

అనంతరం- అహ్మదాబాద్ కు బయలుదేరి వెళ్లారు మోదీ. ఇవ్వాళ నిర్వహించాల్సిన అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తల్లి కన్నుమూసిన బాధను దిగమింగుకుంటూ వర్చువల్ విధానంలో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్ లో 7,800 కోట్ల రూపాయల విలువ గల అభివృద్ధి ప్రాజెక్టులను ఆయన ప్రారంభించనున్నారు. ఇందులో వందేభారత్ ఎక్స్ ప్రెస్ కూడా ఉంది. షెడ్యూల్ ప్రకారం ఇవ్వాళ ఆయన పశ్చిమ బెంగాల్ లో పర్యటించాల్సి ఉంది.

తల్లి కన్నుమూతతో ఇందులో మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. పశ్చిమ బెంగాల్ పర్యటన రద్దయింది. అయినప్పటికీ- వర్చువల్ గా అక్కడి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హౌరా-కోల్ కత వందేభారత్ ఎక్స్ ప్రెస్ ను ఆయన ప్రారంభించనున్నారు. నమామి గంగె మిషన్ సమీక్ష సమావేశానికి హాజరు కానున్నారు. వందేభారత్ సీరిస్ లో ఇప్పుడాయన చేపట్టబోయేది ఏడవది. కోల్ కత-హౌరా మధ్య పరుగులు తీయనుందీ ఎక్స్ ప్రెస్.

PM Modi to Flagging off of the Vande Bharat train in Howrah, Kolkata, and other development works

కాగా- హీరాబెన్ మృతి పట్ల దేశవ్యాప్తంగా సంతాప సందేశాలు వెల్లువెత్తాయి. కేంద్రమంత్రులు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధానికి తమ సంతాపం తెలిపారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గె, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ, అన్ని పార్టీల నాయకులు మోదీకి సంతాపం తెలుపుతూ ట్వీట్లు పోస్ట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+