ఢిల్లీ కేంద్రంగా ప్రధాని మోదీ మార్క్ - కొత్త చరిత్ర..!!
దేశ రాజధానిలో ఎంతో కాలంగా ఉన్న రాజ్ పథ్ నేటి నుంచి కర్తవ్యపథ్ గా మారనుంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఎన్డీఎంసీ ఆమోదం ఇచ్చింది. ఈ రోజున అధికారికంగా ప్రధాని మోదీ కర్తవ్యపథ్ ను ప్రారంభించనున్నారు. ఢిల్లీలో కీలక ప్రాంతంగా ఉన్న రాజ్ పథ్ కు అనేక మార్పులు చేర్పులు చేసారు. అధికార కేంద్రాన్ని సూచించే రాజ్ పథ్ పేరును కర్తవ్యపథ్ గా మారుస్తూ ఢిల్లీ నగరపాలక పరిషద్ అధికారికంగా ఆమోద ముద్ర వేసింది. ఇండియా గేట్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ఉన్న ప్రాంతాన్ని ఈ రోజు నుంచి కర్తవ్య పథ్ గా మారనుంది.
ఎర్ర గ్రానైట్ రాళ్లతో నడకదారులను.. ఆకట్టుకొనే విధంగా పూర్తి పచ్చదనంతో బాటలను తీర్చి దిద్దారు. రాష్ట్రాల వారీగా ఆహార శాలల్ని..పూర్తి హంగులతో ఏర్పాటు చేసారు. సెంట్రల్ విస్టా పేరుతో భారీ అంచనాలతో చేపట్టిన పనుల్లో భాగంగా వీటిని తీర్చి దిద్దారు. సందర్శకుల రద్దీకి అనుగుణంగా ఇక్కడ మార్పులు చేసారు. అదే విధంగా క్రిషి భవన్.. వాణిజ్య భవన్ వద్ద పడవ షికారుకు వీలు కల్పిస్తున్నారు. ఇదే రోజున మరో ప్రముఖుడికి ఢిల్లీ వేదికగా గుర్తింపు దక్కనుంది. 28 అడుగులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఢిల్లీ నడి బొడ్డున ఇండియా గేట్ వద్ద ఠీవీగా నిలబడుతోంది. ఈ విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నారు.

ఈ విగ్రహ ఏర్పాటుకు సంబంధించి ప్రధాని మోదీ ఈ ఏడాది జనవరిలో ప్రకటన చేసారు. ఇందులో తెలంగాణ లోని ఖమ్మం జిల్లాకు భాగస్వామ్యం ఉంది. ఖమ్మం జిల్లా నుంచి 140 చక్రాలు ఉన్న 100 అడుగుల లారీలో 280 మెట్రిక్ టన్నుల బరువు ఉన్న 28 అడుగుల విగ్రహానికి ప్రాణం పోసారు. కర్ణాటకకు చెందిన అరుణ్ యోగిరాజ్ భారతీయ సంప్రదాయ పద్దతిలో ఈ విగ్రహాన్ని తీర్చి దిద్దారు. ప్రధాని మోదీ ఎనిమిదేళ్ల పాలన కాలంలో.. ఇప్పుడు ఢిల్లీలో గత చరిత్రను మార్చుతూ.. మోదీ మార్క్ స్పష్టం అయ్యేలా సెంట్రల్ విస్టాకు రూపకల్పన చేసారు. త్వరలోనే నూతన పార్లమెంట్ భవనం అందుబాటులోకి రానుంది.












Click it and Unblock the Notifications