వ్యాక్సిన్ అప్ డేట్: మరో 3 కంపెనీలతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్, పీఎంవో ట్వీట్
కరోనా వైరస్ వ్యాక్సిన్ స్టేజీ చివరి దశకు చేరుకుంది. శనివారం అహ్మదాబాద్, పుణె, హైదరాబాద్‌లో ఆయా కంపెనీల వ్యాక్సిన్ గురించి క్షేత్రస్థాయిలో మోడీ అడిగి తెలుసుకున్నారు. ఇవాళ మరో మూడు కంపెనీలతో మోడీ వర్చువల్ విధానంలో ఇంటరాక్ట్ అవుతారని ప్రధానమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది.
Recommended Video
జెనొవా బయోఫార్మా, బయోలాజికల్ ఈ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ప్రతినిధులతో మోడీ మాట్లాడతారు. కరోనా వ్యాక్సిన్ డెవలప్ చేస్తోన్న మూడు బృందాలతో మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారని పీఎంవో తెలిపింది. శనివారం అహ్మదాబాద్‌లో జైడస్ బయోటెక్ పార్క్, హైదరాబాద్‌లో భారత్ బయోటెక్, పుణెలో సీరం ఇనిస్టిట్యూట్‌ను మోడీ సందర్శించిన సంగతి తెలిసిందే.

ఆ వెంటనే మరో మూడు వ్యాక్సిన్ అభివృధ్ది చేసే సంస్థలతో సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. న్యూ ఇయర్‌లో వ్యాక్సిన్ బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.
సీరం వ్యాక్సిన్‌ను ఆక్స్ ఫర్డ్ వర్సిటీ అస్ట్రాజెనెకా డెవలప్ చేస్తోన్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జూలై వరకు 400 మిలియన్ డోసుల వరకు డెవలప్ చేస్తామని చైర్మన్ అదర్ పునావాలా తెలిపారు. నెలకు 50 నుంచి 60 మిలియన్ డోసులు ఉత్పత్తి చేస్తామని పునావాలా తెలిపారు. జనవరి తర్వాత 100 మిలియన్ డోసులు ప్రొడక్ట్ చేస్తామని చెప్పారు.
-
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
మాస్కోలోని పుతిన్ నివాసంలో తలదాచుకున్న ఇరాన్ సుప్రీం లీడర్..?? -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications