మోదీ చూపు పడితే అంతే మరి: రాష్ట్రంపై రూ.75,000 కోట్లు గుమ్మరింత - ఎయిమ్స్ సహా..!!

ముంబై: మహారాష్ట్రపై కేంద్ర ప్రభుత్వం నిధులను గుమ్మరించింది. ఒకేసారి 75,000 కోట్ల రూపాయల మేర విలువ చేసే పలు మెగా ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనుంది. మరి కొన్నింటిని ప్రారంభించనుంది. దీనితోపాటు గోవాలో మోపా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా అందుబాటులోకి తీసుకుని రానుంది కేంద్ర ప్రభుత్వం. ఆయా ప్రాజెక్టులన్నింటినీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవ్వాళ జాతికి అంకితం చేయనున్నారు. దీనికోసం ఆయన మహారాష్ట్రలోని నాగ్‌పూర్, గోవాల్లో పర్యటించనున్నారు.

గోవాలో..

గోవాలో..

గోవాలో సుమారు 2,870 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన మోపా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మోదీ ప్రారంభించనున్నారు. ఈ విమానాశ్రయం నిర్మాణానికి 2016 నవంబర్‌లో ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. మౌలిక సదుపాయాలను కల్పించడంలో భాగంగా కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఈ ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి అప్పట్లో అనుమతులను మంజూరు చేసింది. అత్యాధునిక పద్ధతిలో దీన్ని నిర్మించింది.

అత్యాధునిక ఎయిర్‌పోర్ట్..

అత్యాధునిక ఎయిర్‌పోర్ట్..

సౌర విద్యుత్ ప్లాంట్ల కూడా ఇందులోనే అందుబాటులో ఉన్నాయి. విమానాశ్రయం అవసరాల కోసం వినియోగం అయ్యే విద్యుత్‌ను ఈ సౌర విద్యుత్ ప్లాంట్ల నుంచే ఉత్పత్తి చేసుకునేలా దీన్ని కేంద్ర ప్రభుత్వం నిర్మించింది. గ్రీన్ బిల్డింగ్‌, రన్‌వేపై ఎల్ఈడీ లైట్లు వంటి ఇతర సౌకర్యాలు ఇందులో ఉన్నాయి. మూడు జాతీయ ఆయుష్ ఇన్‌స్టిట్యూట్‌లను కూడా మోదీ ప్రారంభించనున్నారు. ఈ మూడు ఆయుష్ ఇన్‌స్టిట్యూట్‌లను 970 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశారు.

ఆయుర్వేద ఫర్ వన్ హెల్త్..

ఆయుర్వేద ఫర్ వన్ హెల్త్..

అనంతరం గోవాలో 9వ ప్రపంచ ఆయుర్వేద కాంగ్రెస్, హెల్త్ ఎక్స్‌పోలో పాల్గొననున్నారు ప్రధాని మోదీ. ఈ సదస్సును ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. ఈ ఈవెంట్‌లో 50 దేశాల 400 మందికి పైగా ప్రతినిధులు పాల్గొననున్నారు. వారిలో పలువురు విదేశీ విద్యార్థులు కూడా ఉన్నారు. ఆయుర్వేదాన్ని ప్రమోట్ చేయడంలో భాగంగా కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ సదస్సును ఏర్పాటు చేసింది. ఆయుర్వేద ఫర్ వన్ హెల్త్ అనేది ఈ సదస్సు థీమ్.

నాగ్‌పూర్‌లో..

నాగ్‌పూర్‌లో..

ఈ ఉదయం 10 గంటలకు ప్రధాని మోదీ న్యూఢిల్లీ నుంచి నాగ్‌పూర్ చేరుకుంటారు. స్థానిక రైల్వే స్టేషన్‌లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను జెండా ఊపి ప్రారంభిస్తారు. అనంతరం 8,650 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో అభివృద్ధి చేసిన నాగ్‌పూర్ మెట్రో మొదటి దశను జాతికి అంకితం చేయనున్నారు. 6,700 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయనున్న నాగ్‌పూర్ మెట్రో ఫేజ్-2 నిర్మాణ పనులకు కూడా మోదీ శంకుస్థాపన చేస్తారు.

నాగ్‌పూర్- షిర్డీ

నాగ్‌పూర్- షిర్డీ

నాగ్‌పూర్ - షిర్డీని అనుసంధానిస్తూ నిర్మించిన 520 కిలోమీటర్ల పొడవునా నిర్మించిన ఎక్స్‌ప్రెస్ వేను మోదీ ప్రారంభిస్తారు. హిందూ హృదయ సామ్రాట్ బాలాసాహెబ్ థాకరే మహారాష్ట్ర సమృద్ధి మహామార్గ్‌గా దీనికి పేరు పెట్టారు. ముంబై-నాగ్‌పూర్‌ను అనుసంధానించడానికి చేపట్టిన మెగా రోడ్ ప్రాజెక్ట్ ఇది. దీని పొడవు 701 కిలోమీటర్లు. దేశంలోనే అతి పొడవైన ఎక్స్‌ప్రెస్‌వేలలో ఒకటి. మహారాష్ట్రలోని 10 జిల్లాల గుండా వెళ్తుంది. దీని నిర్మాణ వ్యయం 55 వేల కోట్ల రూపాయలు.

ఎయిమ్స్ సైతం..

ఎయిమ్స్ సైతం..

దేశంలో ఆరోగ్యరంగంలో మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి నాగ్‌పూర్‌లో నిర్మించిన అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) ఆసుపత్రిని కూడా ప్రధాని మోదీ జాతికి అంకితం చేస్తారు. 2017 జులైలో ప్రధాని ఈ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దీని నిర్మాణ వ్యయం 1,575 కోట్ల రూపాయలు. అనంతరం నాగ్‌పూర్‌లో జరిగే బహిరంగ సభ సందర్భంగా 1,500 కోట్ల రూపాయల విలువ చేసే రైలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+