వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌లో కరోనా: మరో రికార్డు -కొత్తగా 28,903 కేసులు, 188 మరణాలు -విలయంపై సీఎంలతో ప్రధాని భేటీ

|
Google Oneindia TeluguNews

దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్నది. గతేడాది చివరి నుంచి తగ్గిన కేసులు ఈ ఏడాది మార్చి నుంచి మళ్లీ పెరుగుతూ వస్తున్నాయి. ప్రస్తుతానికి మూడు నెలల గరిష్ట స్థాయికి వైరస్ వ్యాప్ పెరిగింది. మహమ్మారి మళ్లీ పడగ విప్పడంతో దాన్ని అడ్డుకోడానికి ఏం చేద్దామంటూ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ సమాలోచనలు జరుపుతున్నారు..

బీజేపీలో ఒకేరోజు భారీ విషాదాలు -కరోనాతో కేంద్ర మాజీ మంత్రి దిలీప్ గాంధీ మృతి -ఎంపీ శర్మ ఆత్మహత్య బీజేపీలో ఒకేరోజు భారీ విషాదాలు -కరోనాతో కేంద్ర మాజీ మంత్రి దిలీప్ గాంధీ మృతి -ఎంపీ శర్మ ఆత్మహత్య

కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం వెల్లడించిన లెక్కల ప్రకారం దేశంలో గడిచిన 24 గంటల్లో మొత్తం 9.69లక్షల పరీక్షలు చేయగా.. 28,903 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,14,38,734కు పెరిగింది. అలాగే, గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 188 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మృతుల సంఖ్య 1,59,044కి చేరింది. దేశంలోమరణాల రేటు 1.39 శాతంగా కొనసాగుతోంది. కాగా,

 PM Modi to meet CMs on Covid 19 as India records 28,903 new cases, highest spike in 3 months

నిన్న ఒక్కరోజే కొత్తగా 17,741 మంది కొవిడ్ వ్యాధి నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 1,10,457,284కు చేరింది. కొత్త కేసులు భారీగా పెరుగుతుండటంతో భారత్ రికవరీ రేటు క్రమంగా తగ్గుతూ 96.65 శాతంగా ఉందిప్పుడు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 2,34,406గా ఉన్నాయి. ఇదిలా ఉంటే..

తిరుపతి బీజేపీ అభ్యర్థిగా రత్నప్రభ లేదా శ్రీనివాసులు -పవన్‌ పరిస్థితేంటి? -చింతాకే కాంగ్రెస్ టికెట్! తిరుపతి బీజేపీ అభ్యర్థిగా రత్నప్రభ లేదా శ్రీనివాసులు -పవన్‌ పరిస్థితేంటి? -చింతాకే కాంగ్రెస్ టికెట్!

దేశంలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. గడిచిన 24గంటల్లో 21లక్షల మందికి టీకా వేశారు. దీంతో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా మొత్తం టీకా అందిన వారి సంఖ్య 3,50,64,536కి చేరింది. కొవిడ్ విలయం నేపథ్యంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం సమావేశం కానున్నారు. వర్చువల్ విధానంలో జరిగే ఈ భేటీలో పెరుగుతున్న కరోనా కేసులు, వ్యాక్సినేషన్ ప్రక్రియను సమీక్షిస్తారు. కరోనా నియంత్రణ చర్యలపై చర్చిస్తారు.

English summary
India detected 28,903 cases of the novel coronavirus on Tuesday, of which 17,864 cases were from Maharashtra — the highest since September 30 last year. More than 1.14 crore people have been found infected in the country till now, while the number of active cases in the country has increased to more than 2.34 lakh. At least 188 deaths were reported on Tuesday, with 87 casualties from Maharashtra and 38 from Punjab. In view of the rising cases, Prime Minister Narendra Modi may chair a meeting with chief ministers today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X