రూటు మార్చిన మోదీ - టార్గెట్ ఫిక్స్..!!
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్ డౌన్ కొనసాగుతోంది. వచ్చే నెల 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సారి ఎన్నికల్లో త్రిముఖ పోటీ కనిపిస్తోంది. మూడు పార్టీలు ఇప్పటికే ఓటర్ల ను ఆకట్టుకోవటానికి భారీగా హామీలు గుప్పించాయి. మేనిఫెస్టోలు విడుదల చేసాయి. ఇక, బీజేపీ ఢిల్లీ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ప్రధాని మోదీ ఢిల్లీలో ప్రచారానికి సిద్దం అవుతున్నారు. బీజేపీకి చెందిన ముఖ్య నాయకత్వం ఢిల్లీలో మొహరిస్తోంది. కొత్త వ్యూహాలతో కేజ్రీవాల్ టార్గెట్ గా బీజేపీ ప్రణాళికలు అమలు చేస్తోంది.
ప్రతిష్ఠాత్మక పోరు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కీలక దశకు చేరింది. బీజేపీ, ఆప్, కాంగ్రెస్ మధ్య ఇక్కడ త్రిముఖ పోటీ కొనసాగుతోంది. కేజ్రీవాల్ ముందుగానే ఎన్నికల బరిలోకి దిగారు. బీజేపీ లక్ష్యంగా ఆప్ వ్యూహాలు అమలు చేస్తోంది. మహిళలు, యువత, మధ్య తరగతి ఓటర్లను దక్కించుకోవటమే లక్ష్యంగా కేజ్రీవాల్ హామీలు ఇస్తున్నారు. దీనికి కౌంటర్ గా బీజేపీ, కాంగ్రెస్ సైతం తమ హామీలను ప్రకటించాయి. ఢిల్లీ ఓటర్లలో సగానికి పైగా ఉన్న మహిళల కోసం మూడు పార్టీలు పోటీ పడి హామీ లను కురిపిస్తున్నాయి. అదే విధంగా వరుసగా హర్యానా, మహారాష్ట్రలో గెలిచిన బీజేపీ ఇప్పుడు ఢిల్లీ పైన గురి పెట్టింది.

మోదీ ప్రచార షెడ్యూల్
ఈ నెలఖరు నుంచి ప్రధాని మోదీతో పాటుగా బీజేపీ అగ్ర నాయకత్వం ఢిల్లీలో మొహరించనుంది. ఇందు కోసం ప్రధాని మోదీ షెడ్యూల్ దాదాపు ఖరారైంది. ప్రధానితో పాటుగా అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రచారం కోసం రానున్నారు. ప్రధాని మోదీ ఈ నెల 29, 31, ఫిబ్రవరి 2న ఢిల్లీలో ఎన్నికల సభల్లో పాల్గొంటారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. అటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ 15 ఎన్నికల సభల్లో ప్రసంగించేలా షెడ్యూల్ సిద్దం చేసారు. అదే విధంగా అమిత్ షా, నడ్డా సైతం ఎంపిక చేసిన ప్రాంతాల్లో జరిగే ఎన్నికల ప్రచారం.. సభల్లో పాల్గొంటారని బీజేపీ నేతలు వెల్లడించారు.
హోరెత్తుతున్న ప్రచారం
బీజేపీని టార్గెట్ చేస్తూ కేజ్రీవాల్ ప్రచారం చేస్తున్న వేళ ప్రధాని మోదీ కొత్త వ్యూహంతో ఢిల్లీ ప్రచార బరిలోకి దిగుతున్నారు. ఇప్పటికే ఢిల్లీలో గెలుపు తమదేనని మోదీ ధీమా వ్యక్తం చేసారు. కాగా, ఫిబ్రవరి 1న కేంద్రం ప్రవేశ పెట్టే బడ్జెట్ సైతం ఈ ఎన్నికల పైన ప్రభావం చూపనుంది. ఈ బడ్జెట్ వేళ ఆప్ ఇప్పటికే కేంద్రం ముందు ఏడు డిమాండ్లను ఉంచింది. ప్రధాని మోదీ ప్రచారంతో ఢిల్లీ ఎన్నికల పోరు కొత్త టర్న్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 8న కౌంటింగ్ కు నిర్ణయించారు. దీంతో, ఢిల్లీ ఎన్నికల వేళ వచ్చే వారం రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.
-
"అప్పుడు వేరు.. ఇప్పుడు వేరు": భారత్ స్థానం మారింది - ప్రధాని మోడీ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications