కుంభమేళాలో మోదీ పుణ్యస్నానం - ముహూర్తం వెనుక..!!
Mahakumbh Mela 2025: మహాకుంభ మేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. మౌని అమావాస్య రోజున పెద్ద సంఖ్యల భక్తులు తరలి రావటంతో తొక్కిసలాట జరిగింది. 60 మంది ప్రాణాలు కోల్పో గా.. మరో 60 మంది వరకు గాయపడ్డారు. కాగా, కాశీ - ప్రయాగ్ రాజ్ మధ్య భక్తుల రద్దీ అనూహ్యం గా పెరిగింది. ఇక, ఫిబ్రవరి 5న ప్రధాని మోదీ మహాకుంభ మేళాకు రానున్నారు. అదే రోజు త్రివేణీ సంగమంలో పుణ్య స్నానం చేయనున్నారు. ఈ ముహూర్తం వెనుక అసలు చర్చ మొదలైంది.
మహాకుంభ మేళాలో భక్తులు పోటెత్తుతున్నారు. ఇప్పటి వరకు 18 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించినట్లు యూపీ ప్రభుత్వం వెల్లడించింది. బుధవారం మౌని అమావాస్య సంద ర్భంగా బుధవారం తెల్లవారుజూమున తొక్కిసలాట జరిగింది. ఇందులో 30 మంది మరణించిన ట్లు యూపీ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో, యూపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్య ఘాట్‌ల దగ్గర రద్దీ తగ్గించేందుకు ఐదు కీలక మార్పులు చేశారు. భక్తులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండేందుకు రోడ్లను వన్ వేగా మార్చారు. వీవీఐపీ పాస్‌లను రద్దు చేశారు.

స్పెషల్ పాస్‌లు ఉన్నప్పటికీ అనుమతించటం లేదు. ఇక, ఫిబ్రవరి 5న ప్రధాని మోదీ మహా కుంభ మేళాకు రానున్నారు. ప్రయాగ్ రాజ్ త్రివేణీ సంగమం లో పుణ్యస్నానం చేయనున్నారు. అయితే.. ప్రధాని మహాకుంభ్ కు వస్తున్న ముహూర్తానికి మరో ప్రత్యేకత ఉంది. అదే రోజు ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. అక్కడ ఎన్నికల పోలింగ్ జరిగే సమయంలో ప్రధాని త్రివేణీ సంగమంలో పుణ్య స్నానం చేయనున్నారు. ఈ నిర్ణయం పైన రాజకీయంగానూ చర్చ సాగుతోంది. ఢిల్లీ ఎన్నికలకు బీజేపీ ఈ సారి ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.
మూడు ప్రధాన పార్టీలు పోటీలో ఉన్నా.. ఆప్, బీజేపీ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. దీంతో, ప్రధాని మోదీ ఢిల్లీలో గెలుపు పైన ధీమా వ్యక్తం చేస్తున్న వేళ..అదే రోజున ప్రయాగ్ రాజ్ పర్యటన ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది. బీజేపీ నేతలు మాత్రం ప్రధాని కుంభమేళా పర్యటన.. ఢిల్లీ ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications