India-Maldives: మాల్దీవుల్ని ఆదుకునేది మేమే-అధ్యక్షుడికి గుర్తుచేసిన ప్రధాని మోడీ..!
ఒకప్పటి సన్నిహిత మిత్రదేశాలైన భారత్-మాల్దీవుల మధ్య గతేడాది చోటు చేసుకున్న ఓ పరిణామం గ్యాప్ తెచ్చింది. అయితే చైనాకు అనుకూలుడుగా పేరున్న అధ్యక్షుడు మొహమ్మద్ మొయిజ్జుపై ఈ ప్రభావం పడింది. దీన్నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్న మొయిజ్జు ఇవాళ న్యూఢిల్లీకి వచ్చి భారత ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అయ్యారు. ఇరుదేశాల మధ్య అన్ని అంశాలపై వీరిద్దరూ చర్చించుకున్నారు. అనంతరం మాల్దీవుల విషయంలో భారత్ వైఖరిని ప్రధాని మోడీ మరోసారి స్పష్టం చేశారు.
ఇవాళ ఢిల్లీలోని హైదరాబాద్ భవన్ లో మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ మొయిజుతో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. ఇరుదేశాల మధ్య తాజా పరిస్ధితులపై చర్చించారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవాల్సిన అవసరాన్ని మాల్దీవుల అధ్యక్షుడికి మోడీ గుర్తుచేసారు. మాల్దీవులకు భారత్ సన్నిహిత మిత్ర దేశమని, భారత్ యొక్క "పొరుగే ముందు "( neighbourhood first) సిద్ధాంతాన్ని కూడా గుర్తుచేసారు. గతంలో కోవిడ్ వ్యాక్సిన్లతో పాటు మాల్దీవుల్లో ఇన్ ఫ్రా ప్రాజెక్టుకు భారత్ అందించిన సాయాన్ని కూడా గుర్తుచేస్తూ.. ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇరుదేశాల ఆర్ధిక వ్యవస్థల స్దిరత్వానికి హిందూ మహాసముద్రంలో భద్రత చాలా కీలకమని ఇరుదేశాల అధినేతలు అభిప్రాయపడ్డారు. గతేడాది ప్రధాని మోడీ లక్షద్వీప్ టూర్ పై మాల్దీవుల మంత్రుల విమర్శల తర్వాత ఇరుదేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి. ఇరుదేశాలూ దౌత్యవేత్తల్ని సైతం బహిష్కరించుకున్నాయి. అనంతరం తిరిగి ఇరుదేశాల సంబంధాలను గాడిన పెట్టేలా ఇవాళ్టి సమావేశం జరిగింది. దీంతో మోడీ సైతం గతాన్ని ఎక్కడా గుర్తుచేయలేదు.












Click it and Unblock the Notifications