వావ్ మోడీ: సోషల్ మీడియాలో క్రేజ్.. ట్విట్టర్ ఫాలొవర్లు 70 మిలియన్లు..
సోషల్ మీడియాలో ప్రధాని మోడీ ముందు ఉంటారు. ఆయనకు ఫాలొవర్లు కూడా ఎక్కువే ఉన్నారు. సోషల్ మీడియాలో ట్విట్టర్‌కు క్రేజ్ ఎక్కువ. ప్రముఖులు చేసే పోస్టులకు అంతేస్థాయిలో స్పందన వస్తోంది. అయితే ప్రధాని మోడీ ట్విట్టర్ ఫాలోవర్స్ సంఖ్య 70 మిలియన్ మార్క్‌ను చేరింది. సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్స్ ఉన్నవారిలో క్రియాశీల రాజకీయ నేతల్లో ఒకరిగా ప్రధాని మోడీ నిలిచారు.
రాజకీయ ప్రసంగాలతో ఎప్పటికప్పుడు తన ఫాలొవర్స్‌ను మోడీ పెంచుకున్నారు. 2009లో మోదీ గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో ట్విట్టర్ ఖాతాను ప్రారంభించారు. 2010లో లక్ష మంది ఫాలొవర్స్ చేరగా.. 2011 నవంబర్‌లో ఫాలోవర్స్ సంఖ్య 4 లక్షలకు పెరిగింది. ఆ తర్వాత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆ సంఖ్య భారీగా పెరిగింది. దేశ ప్రజలను ఉద్దేశించి తన ప్రసంగాలతో ఆకట్టుకుంటున్నారు. ప్రతి విషయాన్ని ప్రజలతో పంచుకోవడంతోపాటు సందేశాలు, సూచనలు చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలపై ట్విట్టర్ వేదికగా వివరిస్తూ వస్తున్నారు.

మోడీ తర్వాత పోప్ ఫ్రాన్సిస్ ట్విట్టర్ ఖాతాకు 53 మిలియన్ల మంది ఫాలొ అవుతున్నారు. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌కు 30.9 మిలియన్లు, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు 129.8 మిలియన్లు, ఫాలొవర్స్ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు 7.1 మిలియన్ల మంది ఫాలొవర్లు ఉన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అమిత్‌షాకు 26.3 మిలియన్ల మంది, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి 19.4 మిలియన్ల ఫాలొవర్స్ ఉన్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఖాతాను ట్విట్టర్ యూఎస్ క్యాపిటల్ వద్ద జరిగిన అల్లర్ల నేపథ్యంలో శాశ్వతంగా తొలగించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆయనకు 88.7 మిలియన్స్ ఫాలొవర్లు ఉన్నారు.












Click it and Unblock the Notifications