ప్రధానికి పంజాబ్ లో మరో చేదు అనుభవం : సరైన ఏర్పాట్లు లేక - ఏం జరిగింది..!!
ప్రధాని మోదీ పంజాబ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ నెల 20న పంజాబ్ ఎన్నికలు జరగనున్నాయి. పంజాబ్ లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా బీజేపీ నేతలు ఎన్నికల ప్రచారంలో మాటల తూటాలు పేల్చుతున్నారు. గత నెలలో ఫిరోజ్‌పుర్ పర్యటనలో భద్రతా లోపం తీవ్ర దుమారం రేపగా.. తాజాగా అధికార యంత్రాంగ వైఫల్యం గురించి స్వయంగా ప్రధానే చెప్పారు. ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన ప్రధాని మోదీ జలంధర్‌లోని దేవీ తలాబ్ మందిరాన్ని దర్శించుకునేందుకు వెళ్లారు. అయితే అధికారులు తగిన ఏర్పాట్లు చేయలేదని, ఫలితంగా మందిరాన్ని దర్శించుకోలేకపోయానని మోదీ చెప్పారు.

గుడి సందర్శనకు ఇబ్బందులు
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ పరిస్థితి ఈ రకంగా ఉందని ధ్వజమెత్తారు. జలంధర్‌కు మరోసారి వస్తానని, దేవిని తప్పక దర్శించుకుంటానని బహిరంగ సభలో మోదీ స్పష్టం చేశారు. దేవీ తలాబ్ మందిరాన్ని దర్శించాలనేది తన కోరిన అని..అయితే, పోలీసులు, యంత్రాంగం అందుకు తగిన ఏర్పాట్లు చేయలేమని చెప్పాయని ప్రధాని వివరించారు. హెలికాప్టర్లో వెళ్లిపోవాలని సూచించారని వెల్లడించారు. ఇక, ఎన్నికల ప్రచార సభలో ప్రధాని కాంగ్రెస్ పైన ఒక రేంజ్ లో ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో భాజపా నేతృత్వంలోని కూటమి విజయం సాధిస్తుందని మోదీ ధీమా వ్యక్తం చేశారు. ఆ తర్వాత పంజాబ్‌లో అభివృద్ధి నూతన శకం మొదలవుతుందని చెప్పారు.

కాంగ్రెస్ - ఆప్ పై విమర్శలు
నవభారత్ ప్రతిజ్ఞతో దేశం ముందుకెళ్తోందని, నవ బంజాబ్ సాకారమైనప్పుడే దేశ ప్రజల ప్రతిజ్ఞ నెరవేరుతుందని అన్నారు. నూతన పంజాబ్‌లో ప్రతి దళితుడికీ గౌరవం లభిస్తుందని, అందరికీ సమాన అవకాశాలు ఉంటాయని వివరించారు. అవినీతికి ఆస్కారం ఉండదని స్పష్టం చేసారు. పంజాబ్‌కు వచ్చి కొందరు పచ్చి అబద్దాలు చెబుతున్నారని దిల్లీ సీఎం కేజ్రీవాల్ లక్ష్యంగా విరుచుకుపడ్డారు. పంజాబ్‌ను మాదకద్రవ్యాలు లేని రాష్ట్రంగా మార్చుతామని చెబుతున్న వారు.. సొంత రాష్ట్రంలో మాత్రం భారీగా మద్యం దుకాణాలను తెరుస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. అంతకు ముందు మోదీ పర్యటన వల్ల తాను రాహుల్ గాంధీ సభకు హాజరు కాలేకపోయానని పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ ఆరోపించారు.
Recommended Video

సీఎం చన్నీ సైతం కౌంటర్ ఎటాక్
ఉదయం 11 గంటలకు తాను ఉనాకు చేరుకున్నానని... హోషియార్‌పుర్ వెళ్లేందుకు తన హెలికాప్టర్‌కు అనుమతి నిరాకరించారని చెప్పారు. మోదీ వెళ్తున్నారని ఆ ప్రాంతాన్ని నో ఫ్లై జోన్‌గా ప్రకటించారు. అందుకే రాహుల్ గాంధీ సభకు హాజరుకాలేకపోయానని చన్నీ వివరించారు. పంజాబ్ లో అధికారం దక్కించుకొనేందుకు బీజేపీ... అధికారం నిలబెట్టుకొనేందుకు కాంగ్రెస్.. సత్తా చాటాలనే పట్టుదలతో ఆప్ ఉన్నాయి. ఎవరి వ్యూహాలు వారు అమలు చేస్తున్నారు. అయితే, ప్రజలు ఎవరి వైపు నిలుస్తారనేది మాత్రం వచ్చే నెల 10వ తేదీన తేలనుంది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications