కరోనా వ్యాప్తి వేళ ప్రధాని మోదీ కీలక సందేశం - సహకరించండి..!!

కరోనా సబ్ వేరియంట్ వ్యాప్తి తో కేంద్రం అప్రమత్తమైంది. రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఇప్పటికే ప్రధాని మోదీ కరోనా పై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. పలు సూచనలు చేసారు. ఇదే సమయంలో స్వయంగా ప్రధాని మోదీ దేశ ప్రజలకు సందేశం ఇచ్చారు. కరోనా మరోసారి విజృంభిస్తోందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. పండుగల వేళ కరోనా బారిన పడకుండా అప్రమత్తం గా ఉండాలని సూచించారు. ముఖ్యంగా జీరో-కోవిడ్ పాలసీని చైనా ఎత్తివేయడంతో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా కట్టుదిట్టమైన చర్యలతో ముందుకు వెళ్తోందని చెప్పారు. స్వీయ రక్షణే కరోనాకు మందు అని చెప్పారు.

ఏడాది ప్రధాని మోడీ చివరి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఈ రోజు పూర్తి చేశారు. మన్ కీ బాత్లో భాగంగా మాట్లాడిన ప్రధాని మోడీ....కొన్నేళ్లుగా ఆరోగ్య రంగంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నామన్నారు. స్మాల్‌పాక్స్, పోలియో వంటి వ్యాధులను భారత్ తుడిచిపెట్టిందని తెలిపారు. ప్రస్తుతం కాలా అజర్ అనే వ్యాధి బీహార్‌, జార్ఖండ్ లోని 4 జిల్లాల్లో మాత్రమే ఉందన్నారు... దాన్ని కూడా అంతం చేస్తామన్నారు. భారత్ 220 కోట్ల కరోనా వ్యాక్సిన్లను ఉత్పత్తి చేసిందని గుర్తు చేసిన ప్రధాని నమ్మలేని రికార్డును సృష్టించిందన్నారు. దీని ద్వారా భారత్ ప్రపంచంలోనే ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించిందని, గ్లోబల్ ఎకానమీలో ఐదో స్థానంలో నిలిచిందని వివరించారు.

PM Modi urged people to take all precautions while Covid rise in other countries in his Mann ki Baat

2022 ఎంతో అద్భుతమైన సంవత్సరంగా ప్రధాని అభివర్ణించారు. 75 సంవత్సరాల స్వాతంత్ర్య దినోత్సవాలతో అమృత్ కాల్ మొదలైందని ప్రధాని చెప్పుకొచ్చారు. అంతరిక్ష, రక్షణ, డ్రోన్ రంగాల్లో కొత్త పుంతలు తొక్కిందని, క్రీడల్లోనూ విజయాలను సొంతం చేసుకున్నామని అన్నారు. ఎగుమతుల విషయంలోనూ 400 బిలియన్ డాలర్ల విలువచేసే మేజికల్ ఫిగర్‌ను సాధించిందన్నారు. ఇండియా జీ20 సదస్సుకు అధ్యక్షత వహించే బాధ్యతను తీసుకుందన్న మోడీ.. 2023లో G20 సదస్సును మరో లెవెల్‌కి తీసుకెళ్దామన్నారు. 2022 సంవత్సరం చాలా స్ఫూర్తిదాయకంగా నిలిచిందన్నారు. అనేక రంగాల్లో అద్భుతాలను సృష్టించగలిగామని తెలిపారు. 2022లో సాధించిన విజయాలు దేశాన్ని ప్రపంచంలోనే గొప్ప స్థానంలో నిలిపాయన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+