2013 విధ్వంసం తర్వాత నా మనస్సు ఏం చెప్పిందంటే- కేదార్‌నాథ్‌లో ప్రధాని మోదీ
ఉత్తరాఖండ్ : గురువారం దీపావళి సందర్భంగా జమ్మూలో పర్యటించి పండగను అక్కడి జవాన్లతో జరుపుకున్న ప్రధాని మోదీ... శుక్రవారం కేదార్‌నాథ్ ఆలయంను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కేదార్‌నాథ్‌లో మోదీ
ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్ ఆలయంను ప్రధాని మోదీ సందర్శించారు. అనంతరం ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి ఆ తర్వాత 12 అడుగుల ఆది గురు శంకరాచార్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇది 35 టన్నుల బరువు ఉన్న ఈ విగ్రహంను 2019 నుంచి తయారు చేయడం ప్రారంభించారు. ఇదిలా ఉంటే ప్రధాని హోదాలో మోదీ కేదార్‌నాథ్ ఆలయాన్ని దర్శించుకోవడం ఇది ఐదవ సారి.
అభివృద్ధి జరుగుతుందని..
"ఈ రోజు జరిగిన ఆదిశంకరాచార్య సమాధి ఆవిష్కరణ కార్యక్రమంలో మీరంతా సాక్షులు.ఆయన భక్తులు ఆత్మస్వరూపంలో ఇక్కడ ఉన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న జ్యోతిర్లింగాలు ఈ రోజు మనతో ఆత్మీయంగా అనుసంధానమై ఉన్నాయి " అని ప్రధాని మోదీ అన్నారు. 2013 తర్వాత కేదార్‌నాథ్‌లో జరిగిన అభివృద్ధి పై ప్రధాని మోదీ మాట్లాడారు.
2013లో వరదలు
2013లో జరిగిన బీభత్సం తర్వాత మళ్లీ కేదార్‌నాథ్ అభివృద్ధికి నోచుకుంటుందా అనే అనుమానం ప్రజల్లో నెలకొందని చెప్పారు. కానీ తన మనసు మాత్రం కచ్చితంగా అభివృద్ధి జరిగి తీరుతుందని పదేపదే చెప్పేదని ప్రధాని అన్నారు.ఢిల్లీ నుంచి తను అను నిత్యం కేదార్‌నాథ్ అభివృద్ధి గురించి సమీక్షించేవాడినని ప్రధాని చెప్పుకొచ్చారు. డ్రోన్ ఫుటేజ్ ద్వారా వీక్షించేవాడినని చెప్పాడు. కేదార్‌నాథ్ పునరాభివృద్ధికి తోడ్పడిన వారందరికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు ప్రధాని మోదీ.
పలు అభివృద్ధి పనులకు మోదీ శ్రీకారం
ప్రధాని మోదీ కేదార్‌నాథ్‌లో రూ.130 కోట్లు విలువ చేసే పలు అభివృద్ధి పనులకు కూడా శ్రీకారం చుట్టారు. ఇందులో మందాకినీ నదిపై గరుడ్ చత్తి వంతెన, తీర్థయాత్రలకు వచ్చే పురోహితుల కోసం గృహాలు వంటివి ఉన్నారు. ఇదిలా ఉంటే ప్రధాని మోదీ శుక్రవారం ఉదయమే డెహ్రాడూన్‌కు చేరుకున్నారు. అక్కడ ఉత్తరాఖండ్ గవర్నర్ లెఫ్ట్‌నెంట్ జనరల్ గుర్మీత్ సింగ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ప్రధానికి స్వాగతం పలికారు.
Recommended Video
12 జ్యోతిర్లింగాల వద్ద మోదీ కార్యక్రమం లైవ్
ఇక 2013లో సంభవించిన వరదలకు ధ్వంసమయ్యాక పునర్నిర్మించిన శంకరాచార్య సమాధిని ప్రధాని ప్రారంభిస్తారు.2013లో వచ్చిన వరదలతో గంగానదికి ఉపనదిగా ఉన్న మందాకిని నది వరదై ప్రవహించింది. ఆ సమయంలో 8వ శతాబ్దంలో నివసించిన శంకరాచార్య విగ్రహం ధ్వంసమైంది. కేదార్‌నాథ్‌లోనే శంకరాచార్య మోక్షం పొందారు. ఇక ప్రధాని మోదీ కార్యక్రమం దేశవ్యాప్తంగా ఉన్న 12 జ్యోతిర్లింగాలు, నాలుగు శంకరాచార్య మఠాలలో, దేశవ్యాప్తంగా ఉన్న పలు ప్రముఖ ఆలయాల్లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications