ట్రంప్ ముఖం కూడా చూడదలచుకోని మోదీ- అమెరికా పర్యటన రద్దు?

ఇష్టానుసారంగా విధిస్తోన్న టారిఫ్ లతో భారత్ సహా అన్ని దేశాలనూ బెంబేలెత్తిస్తోన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. రష్యాను బద్ధశత్రువుగా పరిగణిస్తోన్నారు. ఆ దేశంతో వ్యాపార, వాణిజ్య సంబంధాలు పెట్టుకున్న.. ప్రత్యేకించి- క్రూడాయిల్ కొనుగోలు చేస్తోన్న దేశాలన్నింటిపైనా విరుచుకుపడుతున్నారు. కొరడా ఝుళిపిస్తోన్నారు. ఈ క్రమంలో భారత్ పై ఇప్పటికే ఎకాఎకిన 50 శాతం అదనపు టారిఫ్ లను విధించారు డొనాల్డ్ ట్రంప్.

తొలుత- 25 శాతంతో సరిపెట్టుకున్నాడనుకున్నప్పటికీ- ఆ తరువాత తాజాగా మరో 25 శాతం అదనపు వడ్డింపులు వడ్డించారు. ఫలితంగా 50 శాతం టారిఫ్ భారం భారత్ పై పడింది. ఈ టారిఫ్ అనంతరం అంతర్జాతీయ కీలక పరిణామాలు చోటు చేసుకుంటూ వస్తోన్నాయి. చైనా, రష్యాలతో దోస్తీని పెంపొందించుకుంది భారత్. ఏడేళ్ల తర్వాత ప్రధాని మోదీ చైనాలో అడుగుపెట్టారు. ఆ దేశాధ్యక్షుడు గ్ఝి జిన్ పింగ్ తో సమావేశం అయ్యారు. ఫలితంగా భారత్- అమెరికా సంబంధాల మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి.

PM Modi will not go to the US for UNGA session

ఈ పరిణామాల మధ్య ప్రధాని మోదీ మరో నిర్ణయం తీసుకున్నారు. ఐక్యరాజ్య సమితి సర్వసభ సమావేశాల్లో పాల్గొనడానికి అమెరికా వెళ్ళకూడదని నిర్ణయించారు. ఈ అత్యున్నత స్థాయి సమావేశానికి మోదీకి బదులుగా విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ హాజరుకానున్నారు. భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు. సర్వసభ సమావేశాలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ నెల 27వ తేదీన ఆయన న్యూయార్క్ బయలుదేరి వెళ్లే అవకాశం ఉంది.

ప్రధాని మోదీ చివరిసారిగా 2021లో ఐరాస సమావేశాలకు హాజరయ్యారు. గత ఏడాది మోదీ ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయాన్ని సందర్శించినప్పటికీ, అది సర్వసభ సమావేశం కోసం కాదు. దీనికి రెండు రోజుల ముందు ఆయన సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్ లో పాల్గొన్నారు. దీనని ఉద్దేశించి ప్రసంగించారు. 2022 నుండి జైశంకరే ఐరాస సర్వసభ సమావేశాల్లో పాల్గొంటోన్నారు.

ప్రధానిగా తన 11 ఏళ్ల పదవీకాలంలో- మోదీ నాలుగు సార్లు అంటే 2014, 2019, 2020, 202ల్లో UNGAలో ప్రసంగించారు. మిగిలిన సందర్భాల్లో సుష్మా స్వరాజ్, జైశంకర్ భారత్ కు ప్రాతినిధ్యం వహించారు. ఈ ఏడాది చివర్లో జరిగే క్వాడ్ సమ్మిట్ కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ లో పర్యటించే అవకాశాలు లేకపోలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+