యువత ప్రధాని మోదీ పిలుపు - తొలి దేశంగా..!!
తెలుగు భాష ఒక అద్భుతమైన భాష అని ప్రధాని మోదీ కొనియాడారు. 113వ మన్ కీ బాత్ కార్యక్రమంలో.. ఈ నెల 29న (ఆగస్టు 29న) తెలుగుభాష దినోత్సవాన్ని పురష్కరించుకుని ప్రపంచంలోని తెలుగు మాట్లాడే వారందరికీ తెలుగుభాష దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ఆ భాగంగా ప్రధాని తెలుగు భాషా దినోత్సవం గురించి ప్రస్తావించారు. ఈ మేరకు తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు అంటూ ప్రధాని నరేంద్ర మోదీ తెలుగులో చెప్పారు.
అంతరిక్ష రంగంలో
అంతరిక్ష రంగంలో కృషి చేస్తున్న పలువురు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో మోదీ ముచ్చటించారు. అంతరిక్ష రంగంలో భారత్ దూసుకెళ్తోందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. చంద్రయాన్-3 విజయానికి గుర్తుగా స్పేస్ డే నిర్వహించుకున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాదే తొలి అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకొన్నామని పేర్కొన్నారు. అంతరిక్ష రంగంలో భారత్ తీసుకొచ్చిన అనేక సంస్కరణలతో యువత పెద్ద ఎత్తున లబ్ధి పొందినట్లు వెల్లడించారు.చంద్రయాన్ 3 చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగిన తొలి దేశంగా భారత్ నిలిచిందని గుర్తుచేశారు.

పునాదుల పటిష్టం
వికసిత్ భారత్ లక్ష్యం దిశగా దేశ పునాదులను పటిష్ఠం చేసే ఎన్నో విషయాలు 21వ శతాబ్దంలో జరుగుతున్నాయని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో పేర్కొన్నారు. ఎలాంటి నేపథ్యం లేని లక్ష మంది యువత రాజకీయాల్లోకి రావాలని ఎర్రకోట వేదికగా ఇచ్చిన పిలుపునకు విస్తృత స్పందన వచ్చిందని వెల్లడించారు. అభివృద్ధి చెందిన దేశం, బలమైన ప్రజాస్వామ్యం కోసం నేటి యువత ప్రజా జీవితంలోకి రావాలని పునరుద్ఘాటించారు. వ్యాఖ్యానించారు. పెద్ద సంఖ్యలో యువత రాజకీయాల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.
తొలి దేశంగా
ఈ సంవత్సరం హర్ ఘర్ తిరంగా ప్రచారం పెద్ద ఎత్తున చేపట్టామని మోదీ తెలిపారు. ఇళ్లు, దుకాణాలు, కార్యాలయాల వద్ద జాతీయ జెండాలు ఆవిష్కరించినట్లు తెలియజేశారు. స్వాతంత్య్ర దినోత్సవం సామాజిక వేడుకగా మారిందని పేర్కొన్నారు. తన పిలుపు మేరకు దాదాపు ఐదు కోట్లకు పైగా మంది జాతీయ జెండాతో ఫొటోలు దిగి సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ చేసినట్లు వెల్లడించారు. చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని అన్వేషించిన మొదటి దేశంగా భారత్ నిలిచిందన్నారు. చంద్రయాన్ 3 విజయానికి గుర్తుగా స్పేస్ డే నిర్వహించుకున్నట్లు తెలిపారు. ఈ ఏడాది తొలి అంతరిక్ష దినోత్సవాన్ని నిర్వహించుకున్నామన్నారు.












Click it and Unblock the Notifications