ట్రంప్ నిర్ణయానికి జై కొట్టిన ప్రధాని మోదీ: కథ సుఖాంతం

ఇజ్రాయెల్ సాగిస్తోన్న దాడులతో అల్లకల్లోలంగా మారిన గాజాలో శాంతి నెలకొల్పడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం అభినందించారు. ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాల శాంతి ప్రణాళికలోని కొన్ని ప్రతిపాదనలను గాజా మిలిటెంట్ గ్రూప్ హమాస్ అంగీకరించిన వెంటనే ప్రధాని మోదీ స్పందించారు. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో దీనికి సంబంధించిన ఓ పోస్ట్ పెట్టారు.

గాజాలో శాంతి ప్రయత్నాలు కీలక పురోగతి సాధిస్తోన్నాయని ప్రధాని మోదీ అన్నారు. ఈ విషయంలో డొనాల్డ్ ట్రంప్ సాగిస్తోన్న ప్రయత్నాలు, ఆయన నాయకత్వాన్ని తాము స్వాగతిస్తోన్నామని పేర్కొన్నారు. ట్రంప్ చేసిన ప్రతిపాదనల వల్ల సుదీర్ఘకాలంగా హమాస్ చెరలో ఉన్న ఇజ్రాయెల్ బందీల విడుదలకు సంబంధించిన సూచనల్లో ఓ ముఖ్యమైన ముందడుగు పడిందని వ్యాఖ్యానించారు. ఈ చర్యలు ప్రశంసాపూరకమైనవని పేర్కొన్నారు.

PM Modi s Praise for Trump s initiatives in Gaza Negotiations

గాజాతో పాటు మధ్య- తూర్పు దేశాల్లో శాశ్వత ప్రాతిపదికన శాంతియుత వాతావరణాన్ని పునరుద్ధరించడానికి ట్రంప్ ప్రతిపాదనలు దోహదపడతాయని, అందులో మెజారిటీ షరతులను హమాస్ అంగీకరించడం దీనికి నిదర్శనమని ప్రధాని మోదీ అన్నారు. ఇరువర్గాలకు సమ న్యాయాన్ని కలిగించే అన్ని రకాల ప్రయత్నాలకు కూడా భారత్ బలమైన మద్దతును ఇస్తుందని ఆయన తేల్చి చెప్పారు. ట్రంప్ సూచించిన అన్ని ప్రతిపాదనలను హమాస్ అంగీకరిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలో గాజాలో శాంతి ప్రయత్నాలు నిర్ణయాత్మక పురోగతిని సాధిస్తాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. బందీల విడుదల కీలకమైన ముందడుగు అని వెల్లడించారు.

ఇజ్రాయెల్- గాజా మధ్య సంధిని కుదర్చడానికి డొనాల్డ్ ట్రంప్ కొన్ని ప్రతిపాదనలను చేసిన విషయం తెలిసిందే. తాను ప్రతిపాదించిన శాంతి ప్రణాళికను ఆదివారం సాయంత్రం 6 గంటల (అమెరికా కాలమానం ప్రకారం) లోపు అంగీకరించాల్సి ఉంటుందని, లేకపోతే భయంకరమైన పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందని హమాస్ మిలిటెంట్ గ్రూప్ కు అల్టిమేటం జారీ చేశారు. ఆ తర్వాత కొద్ది గంటలకే హమాస్ ఈ ప్రణాళికలోని కొన్ని భాగాలను అంగీకరించింది.

ట్రంప్ ప్రతిపాదించిన గాజా శాంతి ప్రణాళికల్లో ముఖ్యమైనది- యుద్ధాన్ని తక్షణమే ముగించడం. దీన్ని హమాస్ అంగీకరించింది. ఇజ్రాయెల్ బలగాల ఉపసంహరణ, తమ వద్ద బందీలుగా ఉన్న ఆ దేశ పౌరులను విడుదల చేయడం, అదే సమయంలో పాలస్తీనా ఖైదీలను కూడా ఇజ్రాయెల్ విడుదల చేసేలా ఈ ప్రతిపాదనలు ఉన్నాయి. శాంతియుత వాతావరణం నెలకొనడానికి పరస్పరం సహకరించుకోవడం- వాటి పునరుద్ధరణ ప్రయత్నాల వంటివి ఇందులో ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+