ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం... ఈ రోజు నుంచే భారీ వర్షాలు?

దేశంలో వాతావరణం ఒకేసారి పలు రకాల మార్పులకు లోనవుతోంది. ఒకవైపు భానుడి వేడి క్రమంగా తగ్గి చలిగాలులు ఊపందుకుంటుంటే, మరోవైపు సముద్రంలో దూసుకొస్తున్న కొత్త వాతావరణ వ్యవస్థలు కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా దక్షిణ అండమాన్ సముద్రం దానిని అనుకొని ఉన్న పరిసర ప్రాంతాల్లో బలమైన ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.

ఈ ప్రభావంతో సముద్ర మట్టంలో మార్పులు వేగంగా జరుగుతున్నాయి. ఇది చూస్తుండగానే ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనంగా రూపాంతరం చెందిందని, ఇది రాబోయే రోజుల్లో తీర ప్రాంతాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

రోజురోజుకూ బలం పుంజుకుంటున్న వ్యవస్థలు

బంగాళాఖాతంలో రూపుదిద్దుకున్న ఈ అల్పపీడన వ్యవస్థ చాలా వేగంగా తన రూపురేఖలను మార్చుకుంటోంది. ప్రస్తుతానికి సాధారణ రూపంలో ఉన్నప్పటికీ, ఇది వాయువ్య దిశగా ప్రయాణిస్తూ మరింత శక్తిని సమకూర్చుకోనుంది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం, నేడు అల్పపీడనం ఏర్పడనుంది. ఇది రేపటికి తీవ్ర అల్పపీడనంగా బలపడే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ తర్వాతి రోజే, అంటే ఈ నెల 15వ తేదీ నాటికి ఇది మరింత శక్తివంతమైన వాయుగుండంగా మారి ముందుకు సాగే అవకాశం ఉంది. గాలిలో తేమ శాతం పెరగడం, సముద్రంలో తగిన ఉష్ణోగ్రతలు ఉండటంతో ఈ వ్యవస్థ అనుకున్నదానికంటే వేగంగా వాయుగుండంగా మారేందుకు పరిస్థితులు అనుకూలిస్తున్నాయి.

Bay of Bengal System Intensifies into Depression Heavy Rains Expected as Winter Chill Hits North India
 బంగాళాఖాతంలో అల్పపీడనం, తుఫానుగా మారే ఛాన్స్ - ఈ జిల్లాలకు తాజా అలర్ట్స్..!!
బంగాళాఖాతంలో అల్పపీడనం, తుఫానుగా మారే ఛాన్స్ - ఈ జిల్లాలకు తాజా అలర్ట్స్..!!

దీవులకు తుఫాను ముప్పు.. పెరగనున్న వర్షపాతం

ఈ వాతావరణ వ్యవస్థ కారణంగా అండమాన్, నికోబార్ దీవులలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అక్కడ విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ప్రమాదం ఉంది. వర్షంతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో తీరప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. పిడుగులు పడే సూచనలు కూడా ఉన్నందున మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేశారు. వాయుగుండం దిశను బట్టి మైదాన ప్రాంతాల వాతావరణం ఆధారపడి ఉంటుంది.

వణికిస్తున్న చలి.. భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు!
వణికిస్తున్న చలి.. భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు!

ఉత్తరాదిన మొదలైన చలిగాలులు.. మంచు దుప్పటి

దక్షిణాన సముద్రంలో తుఫాను వాతావరణం కనిపిస్తుంటే, ఉత్తర భారతదేశంలో శీతాకాల పలకరింపులు మొదలయ్యాయి. జమ్మూ కాశ్మీర్, లడఖ్ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు బాగా పడిపోయి వర్షాలు, మంచు కురిసే అవకాశాలు ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్ రాష్ట్రాలలో కూడా అక్కడక్కడా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడవచ్చు. కొండ ప్రాంతాల నుండి వీస్తున్న చల్లనిగాలులు మైదాన ప్రాంతాలను తాకుతుండటంతో దేశ రాజధాని ఢిల్లీతో పాటు హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. రాబోయే వారంలో కనిష్ట ఉష్ణోగ్రతలు మరో 3 నుంచి 5 డిగ్రీల వరకు పడిపోయే అవకాశం ఉనందున శీతాకాలపు వణుకు మొదలుకావడం ఖాయంగా కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+