కేజ్రీ సాక్షిగా రైతు ఆత్మహత్య: ప్రధాని విచారం, మృతిపై ఫ్యామిలీ
న్యూఢిల్లీ: భూసేకరణ బిల్లుకు వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ చేపట్టిన ర్యాలీలో రైతు ఆత్మహత్య చేసుకోవడంపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. రైతు బలవన్మరణం విచారకరమని, ఇది తనను కలచివేసిందని పేర్కొన్నారు. ఏకాకులమైనట్లుగా ఏ దశలోను రైతులు భావించవద్దని విజ్ఞప్తి చేశారు. దేశ రైతులకు మంచి భవిష్యత్తు కోసం ప్రభుత్వం ఉందని చెప్పారు.
రైతు ఆత్మహత్యకు కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, వికే సింగ్ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ ఆసుపత్రిని సందర్శించారు. రైతుల భూమిని ప్రజలు లాక్కోకుండా తాము అడ్డుకుంటామని రాహుల్ అన్నారు.
కళ్లెదురుగా రైతు ఆత్మహత్యకు పాల్పడుతున్న కేజ్రీవాల్ రాజకీయం చేస్తూ కూర్చున్నారని బీజేపీ మండిపడింది. రైతు ఆత్మహత్యలకు కాంగ్రెస్ పార్టీయే కారణమని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆరోపించారు. కాగా, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రైతు ఆత్మహత్యపై మెజిస్టీరియ్ విచారణకు ఆదేశించారు.

పంటనష్టంతో ప్రాణాలు తీసుకున్నాడు: కుటుంబ సభ్యులు
రైతు గజేంద్ర సింగ్ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ర్యాలీ సందర్భంగా చెట్టు ఎక్కి ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీనిపై ఆయన కుటుంబ సభ్యులు స్పందించారు. పంట నష్టాల వల్లే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారని కుటుంబ సభ్యులు చెప్పారు.
వ్యవసాయం పైనే ఆధారపడి ముగ్గురు పిల్లలున్న కుటుంబాన్ని పోషిస్తున్నాడని, సాగు చేసిన పంట నష్టాలకు తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడ్డాడని తెలిపారు. మరోవైపు, సింగ్ ఆర్థిక పరిస్థితి బాగుందని, ఆత్మహత్యకు పంట నష్టాలు కారణం కావని జిల్లా అదనపు కలెక్టర్ కైలాస్ శర్మ చెప్పారు.












Click it and Unblock the Notifications