ముగిసిన మోడీ ఫ్రాన్స్ పర్యటన, అధ్యక్షుడికి అరుదైన కానుక (ఫోటోలు)

న్యూఢిల్లీ: తన మొదటి ఫ్రాన్స్ పర్యటన ముగింపు సందర్భంగా భారత ప్రధాని నరేంద్రమోడీ తన పర్యటనకు గుర్తుగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండేకు అద్భుతమైన కానుకను ఇచ్చాడు. 'ట్రీ ఆఫ్ లైఫ్' అనే చిత్రపటాన్ని ఆయనకు గుర్తుగా బహుకరించారు.

ఒడిశా కళాకారుడు భాస్కర్ మహాపాత్ర పట్టు వస్త్రంపై రూపొంచించిన ఈ చిత్రం ప్రాచీన కాలం నుంచి భారత దేశ సంస్కృతి, సంప్రదాయాలు ప్రకృతిని ఎంతగా ఆరాధిస్తాయో తెలుపుతుంది. దీంతో ప్రధాని నరేంద్రమోడీ ఫ్రాన్స్ ముగిసింది. దీంతో ఆయన ఆదివారం జర్మనీకి బయలుదేరారు.

మూడు దేశాల పర్యనటలో భాగంగా ప్రధాని మోడీ జర్మనీలోని హనోవర్ చేరుకున్నారు. కేపిటల్ గూడ్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన హానోవర్‌లో జరుగుతున్న ప్రఖ్యాత వాణిజ్య ప్రదర్శనను మోడీ సోమవారం ప్రారంభిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని వందల దేశాల నుంచి ఆరు వేల మంది ఈ ఫెయిల్‌లో పాల్గొంటారు.

ఆ తర్వాత సోమవారం బెర్లిన్‌లో భారతీయులతో ఆత్మీయ సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ మునిమనవడు సూర్యకుమార్ బోస్ కలవనున్నారు. దేశం కోసం పోరాడిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఏమయ్యారనే విషయంలో రహస్య పత్రాలను ఇప్పటికైనా బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

ముగిసిన మోడీ ఫ్రాన్స్ పర్యటన, అధ్యక్షుడికి అరుదైన కానుక

ముగిసిన మోడీ ఫ్రాన్స్ పర్యటన, అధ్యక్షుడికి అరుదైన కానుక

తన మొదటి ఫ్రాన్స్ పర్యటన ముగింపు సందర్భంగా భారత ప్రధాని నరేంద్రమోడీ తన పర్యటనకు గుర్తుగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండేకు అద్భుతమైన కానుకను ఇచ్చాడు. 'ట్రీ ఆఫ్ లైఫ్' అనే త్రపటాన్ని ఆయనకు గుర్తుగా బహుకరించారు.

 ముగిసిన మోడీ ఫ్రాన్స్ పర్యటన, అధ్యక్షుడికి అరుదైన కానుక

ముగిసిన మోడీ ఫ్రాన్స్ పర్యటన, అధ్యక్షుడికి అరుదైన కానుక

దీనికి ముందు ప్రవాస భారతీయుల విందులో పాల్గొన్న ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడుతూ గతంలో టూరిస్టుగా ప్యారిస్‌కు వచ్చినట్లు తెలిపారు. ఇక్కడి నుంచి భారత్‌కు టూరిస్టులను తీసుకెళ్లేందుకు వచ్చానని అన్నారు. జర్మనీలోని
హానోవర్‌లో జరుగుతున్న ప్రఖ్యాత వాణిజ్య ప్రదర్శనను మోడీ సందర్శిస్తారు.

 ముగిసిన మోడీ ఫ్రాన్స్ పర్యటన, అధ్యక్షుడికి అరుదైన కానుక

ముగిసిన మోడీ ఫ్రాన్స్ పర్యటన, అధ్యక్షుడికి అరుదైన కానుక

ఈ ప్రదర్శనలో దాదాపు 400 భారతీయ కంపెనీలు పాల్గొంటున్నాయి. ఆ తర్వాత జర్మనీ రాజధాని బెర్లిన్ చేరుకొని ఆ దేశ చాన్స్‌లర్ ఎంజెలా మొర్కెల్‌తో ప్రధాని ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. జర్మనీ పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులతో వేర్వేరుగా సమావేశమవుతారు.

 ముగిసిన మోడీ ఫ్రాన్స్ పర్యటన, అధ్యక్షుడికి అరుదైన కానుక

ముగిసిన మోడీ ఫ్రాన్స్ పర్యటన, అధ్యక్షుడికి అరుదైన కానుక

ఆ తర్వాత సోమవారం జర్మనీలోని భారతీయులతో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొంటారు. జర్మనీలో మూడురోజుల పర్యటన అనంతరం ఆయన కెనడా బయలుదేరి వెళ్తారు. కెనడాలోని ఒట్టావా, టొరంటో, వాంకోవర్ నగరాల్లో ప్రధాని మోడీపర్యటిస్తారు.

 ముగిసిన మోడీ ఫ్రాన్స్ పర్యటన, అధ్యక్షుడికి అరుదైన కానుక

ముగిసిన మోడీ ఫ్రాన్స్ పర్యటన, అధ్యక్షుడికి అరుదైన కానుక

కెనడా ప్రధాని స్టీఫెన్ హార్పర్‌తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. టొరంటోలో ఈ నెల 15వ తేదీన రికో కలోసియంలో భారతీయులనుద్దేశించి ప్రసంగిస్తారు. 16వ తేదీన వాంకోవర్‌లోని హిందూ దేవాలయం, సిక్కు గురుద్వారాలను సందర్శంచి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు.

 ముగిసిన మోడీ ఫ్రాన్స్ పర్యటన, అధ్యక్షుడికి అరుదైన కానుక

ముగిసిన మోడీ ఫ్రాన్స్ పర్యటన, అధ్యక్షుడికి అరుదైన కానుక

ఫ్రాన్స్ పర్యటన సందర్భంగా భారత ప్రధాని నరేంద్రమోడీతో ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీ కరచాలనం చేస్తున్న దృశ్యం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+